39.2 C
Hyderabad
May 3, 2024 12: 17 PM
Slider నల్గొండ

రక్తదానం చేద్దాం మానవ ప్రాణాలు నిలబెడదాం

#donate blood

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరటంతో వైద్యులు పరీక్షలు చేసి రక్తం తక్కువ ఉంది అని చెప్పటంతో తన కుటుంబ సభ్యులు పట్టణంలో ఉన్న జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పార సాయి కి ఫోన్ చేసి ‘ఓ’ పాజిటివ్ రక్తం కావాలని చెప్పడంతో ట్రస్ట్ సభ్యులు వంశీ,సాయి,శివ, రమేశ్ స్పందించి పట్టణానికి చెందిన నాగమణి అనే మహిళకు ఫోన్ చేసి ‘ఓ’ పాజిటివ్ రక్తం కావాలని చెప్పడంతో వెంటనే స్పందించి కోదాడ బ్లడ్ బ్యాంక్ వెళ్లి సకాలంలో రక్తం ఇచ్చింది.

ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పార సాయి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు మానవత్వంతో రక్తదానం చేయాలని,ప్రాణ దాతలుగా నిలవాలని కోరారు.అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలబడిన నాగమణి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పేషెంట్ కుటుంబ సభ్యులు జన చైతన్య ట్రస్ట్ వారికి,రక్తం ఇచ్చిన దాతకి,వారి బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ప్రజా మన్ననలు పొందిన ఉద్యోగి ధన్యుడు

Satyam NEWS

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్

Satyam NEWS

డివైన్ పవర్:జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Satyam NEWS

Leave a Comment