37.2 C
Hyderabad
April 30, 2024 11: 50 AM
Slider ఖమ్మం

ఐటిడిఏ సాధనే లక్ష్యంగా పోరాడుదాం

#ITDA

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభివృద్ధిని విస్మరించి పోరాడి సాధించుకున్న హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ తెగల మధ్య విద్వేషాన్ని సృష్టించి లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుందని, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు.

మణిపూర్ తరహాలో దేశ వ్యాప్తంగా ప్రజల మధ్య, తెగల మధ్య, వైరుధ్యం సృష్టించే కుట్రలు కొనసాగుతున్నాయని, గిరిజనులు అందరూ ఐక్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. తండాల అభివృద్ధికి “అభివృద్ధి మండలి” ఏర్పాటు చేసి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం కొరకు జిల్లా కేంద్రంలో తక్షణమే ఐటీడీ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏ సాధన కోసం గిరిజనులు ఐక్యంగా ముందుకు రావాలని, కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని కోరారు. దేశంలో గిరిజనుల స్థితిగతులపై ఈనెల రెండో వారంలో తమిళనాడు రాష్ట్రంలో జరుగు జాతీయ గిరిజన మహాసభలో చర్చించి జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మించడానికి ఆదివాసి అధికార రాష్ట్ర మంచ్ మహాసభలు పిలుపు ఇవ్వబోతుందని ఆయన తెలిపారు.

మహాసభల విజయవంతానికి కూర్చి మంచి మండలంలో వివిధ తండాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ , జిల్లా సహయ కార్యదర్శి భూక్యా కృష్ణ నాయక్, పాలేరు నియోజకవర్గ కన్వీనర్ మూడ్ గన్యా నాయక్, మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు హలవత్ వాసు నాయక్, హలవత్ చాంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్ రోలర్స్ సమావేశం

Satyam NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్

Satyam NEWS

వనమా అనర్హుడు…కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం

Bhavani

Leave a Comment