39.2 C
Hyderabad
May 3, 2024 11: 22 AM
Slider జాతీయం

సహజీవనం చేసేవారిని తల్లిదండ్రులు వేరు చేయలేరు

#LivingTogether

ఏ తల్లి తండ్రి కూడా తమ మేజర్ అయిన పిల్లలను ఇలాగే జీవించాలి అంటూ శాసించలేరని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. మేజర్ అయిన పిల్లగానీ, పిల్లవాడు గానీ తన ఆలోచనలకు అనుగుణంగా ఉండేందుకు స్వేచ్ఛనివ్వాలని హైకోర్టు అభిప్రాయపడింది.

పిల్ల లేదా పిల్లవాడు పెళ్లి చేసుకునే వయసు రాలేదు కాబట్టి తమ మాట వినాలని తల్లిదండ్రులు పట్టుపట్టేందుకు వీలు లేదని న్యాయమూర్తి జస్టిస్ అల్కా సెరేన్ ధర్మాసనం అభిప్రాయపడింది.

మేజర్ అయిన ఇద్దరు యువతీయువకులు వేసిన పిటిషన్ ను అనుమతిస్తూ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది.  సమాజం హర్షించదు అనే కారణం చూపి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది.

అంతే కాకుండా సమాజం మొత్తం కలిసి కూడా వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపజాలదని న్యాయమూర్తి అన్నారు. పిటిషన్ దాఖలు చేసిన 18 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల అబ్బాయి లను సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారికి వివాహ వయసు రానంత మాత్రాన వారి ఇష్టాలను కాదనలేమని కోర్టు చెప్పింది. వీరిద్దరూ వివాహ వయసు రానందున కలిసి జీవిస్తున్నారు.

Related posts

మలయాళ హీరో సురేష్ గోపిపై ఛార్జ్‌షీట్

Satyam NEWS

టి-సాట్ ను సందర్శించిన ఇండియన్ ఇన్మఫర్మేషన్ సర్వీసు అధికారులు

Satyam NEWS

ములుగు లోని దేవుని గుట్ట ఆలయం అద్భుతం

Satyam NEWS

Leave a Comment