39.2 C
Hyderabad
April 30, 2024 19: 33 PM
Slider ప్రత్యేకం

టి-సాట్ ను సందర్శించిన ఇండియన్ ఇన్మఫర్మేషన్ సర్వీసు అధికారులు

#saileshreddy

భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం సమన్వయంతో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐ.ఐ.ఎస్) 2019 బ్యాచ్ కు అధికారులు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించారు. టి-సాట్ కార్యాలయంలో సీఈవో శైలేష్ రెడ్డితో జరిగిన ముఖాముఖిలో బృందం సభ్యులు టి-సాట్ నిర్వహణ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

2014 సంవత్సరానికి ముందు కేవలం వందల సంఖ్యలో సేవలందించిన టి-సాట్ వివిధ మార్గాల ద్వారా తెలంగాణలోని సుమారు 90 శాతం మంది ప్రజలకు చేరువైందని  టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి చెప్పారు.  గత ఆరు సంవత్సరాలుగా టి-సాట్ నెట్ వర్క్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు.

కేవలం ఆర్.ఒ.టి పద్దతిలో ప్రసారాలను అందించే టి-సాట్ నెట్ వర్క్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేబుల్, డీటీహెచ్, శాటిలైట్ విభాగాలతో పాటు డిజిటల్ మీడియాలోనూ వివిధ రంగాలకు విస్తరించిన సేవల విధానాన్ని శ్రీ శైలేష్ రెడ్డి తెలిపారు. డిజిటల్ విద్యతో పాటు, ఆరోగ్య సలహాలు, పోటీ పరీక్షల సమాచారం, వ్యవసాయ సేద్యంలోని కొత్త మెళకువలు ఆయా రంగాలకు చేరవేయడంలో టి-సాట్ పని చేసిన పద్దతులను ఆయన అధికారులకు వివరించారు.  ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారంతో ప్రజలకే ప్రయోజనం చేకూర్చే సమాచారాన్ని చేరవేయడంలో కమ్యూనికేషన్ రంగం పాత్ర కీలకమని, ఆ రంగాన్ని ఎంచుకున్న ఐఐఎస్ బృందాన్ని ఆయన  అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

పి.ఐ.బి మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి వి. గాయత్రి, ఐఐఎస్ అధికారులు ఆశీష్ గోయల్, డి. బాలనాగేంద్రన్, కె. అనురాగ్ కుమార్, సాయి వెంపటి టి-సాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐఎస్ అధికారులు టి-సాట్ నిర్వహణ గురించి తెలుసుకొని కార్యాలయంలోని స్టూడియో, పీసీఆర్, ఎర్త్ స్టేషన్ పనితీరును పరిశీలించారు.

Related posts

భారతదేశం గర్వించదగ్గ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం

Satyam NEWS

పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి

Satyam NEWS

వాజ్ పేయి జయంతి సందర్భంగా బ్రెడ్డు పండ్లు పంచిన ఎన్వీఎస్సెస్

Bhavani

Leave a Comment