38.2 C
Hyderabad
April 27, 2024 16: 59 PM
Slider కరీంనగర్

సిరిసిల్లలో లాక్ డౌన్ అమలు తీరు పర్యవేక్షించిన ఎస్ పి

#RahulHegdeIPS

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు. అయినా కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తుండటంతో లాక్ డౌన్ పెట్టిన లక్ష్యం నెరవేరడం లేదు.

ఈ లోపాన్ని క్షేత్రస్థాయిలో సరిదిద్దేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు కృషి చేయాలని రాష్ట్ర డిజిపి ఆదేశాలు ఇచ్చారు.

ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల ఎస్ పి రాహుల్ హెగ్డే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అవసరమైన వాహనదారులను మాత్రమే అనుమతించారు.

సిరిసిల్ల లోని నేతన్న చౌరస్తాలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి పని పైనే వెళుతున్నామని చెప్పిన వారి గుర్తింపు పత్రాలను ఎస్ పి తనిఖీ చేశారు.

అనవసరంగా రోడ్ల పైకి రావద్దని ఆయన ప్రజలకు హితవు చెప్పారు.

ఈ సందర్భంగా గా పలు వాహనదారులను విచారించిన ఎస్పీ రాహుల్ వారు చెప్పిన కారణాలు సరిగా లేని వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పై అంటువ్యాధుల చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Related posts

వటపత్రసాయి అలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు

Satyam NEWS

మెడికల్ లీవ్: జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్‌

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment