32.2 C
Hyderabad
May 2, 2024 02: 58 AM
Slider విజయనగరం

క్లిష్ట సమయంలో నిబంధనలు అతిక్రమిస్తున్నారు…వారే

#lock down

కరోనా సెకండ్ వేవ్ లో ప్రతీ ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవడానికి ప్రజలలో మధ్య వయస్కులు అందునా యువకులే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోలీసు ఇంటలిజెన్స్ కూడా ప్రభుత్వానికి ఈ విధంగానే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఉదిహరణే.. విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ సమయంలో నే పోలీసులకు యువకులు పట్టుబడటం అందుకు నిదర్శనం.

కర్ఫ్యూ సమయంలో అత్యవసరంగా బయటకు రావాలంటే ఐడీ కార్డులు, పాస్ లు ఉండాలని పోలీసులు చెప్పకనే చెప్పారు. అంతే గాకుండా వేరే ఊరు వేరే జిల్లా వెళ్లాలన్న ఈ పాస్ కూడా అందుబాటులో కి తెచ్చింది.. పోలీసు శాఖ.

ఇవన్నీ తెలిసిన యువకులే సరదా కోసం, షికారు కోసం కర్ఫ్యూ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి రావడం పోలీసులకు జరీమాన లు వేసే పని కల్పిస్తున్నారు.

ఈ నెల 23  సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నగరంలో సీఎంఆర్ సీఎంఆర్ జంక్షన్ వద్ద కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన సత్యం న్యూస్. నెట్ కంట పడింది.

అక్కడే డ్యూటీ నిర్వహిస్తున్న వన్ టౌన్ ఎస్ఐ దేవీ..యువకులను గుర్తించి..ప్రశ్నలు వేయడంతో యవ్వారం వెలుగు చూసింది.

దీంతో ఇలా దాదాపు యాభై మంది అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నట్లు తెలియడంతో తమ పై ఉన్నతాధికారులకు తెలియజేసారు.

Related posts

నందిగామ ప్ర‌భుత్వాసుప‌త్రిలో అంద‌ని ద్రాక్ష‌గా వైద్య‌సేవ‌లు

Satyam NEWS

నో ఫొటోస్ :కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

Satyam NEWS

ముస్లింలపై జరుగుతున్న దాడులపై టీడీపీ నేత భత్యాల నిరసన

Satyam NEWS

Leave a Comment