40.2 C
Hyderabad
April 29, 2024 17: 06 PM
Slider ప్రత్యేకం

మైనింగ్ ద్వారా నష్టపోయిన వారికే పెద్ద పీట

#niranjanreddy

మైనింగ్ ద్వారా నష్టపోయిన వారికే పెద్దపీట వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా ఖనిజ నిధులను మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలని జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. 

శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ సమావేశము నిర్వహించారు. ఈ ట్రస్ట్ కు మంత్రి అధ్యక్షులు కాగా  జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సభ్య కార్యదర్శి గాను, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మౌళిక వసతులు, సంక్షేమ  శాఖల అధికారులు సభ్యులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ సమావేశం ఎప్పుడో నిర్వహించాల్సిందని, కానీ కోవిడ్ కారణంగా, సమయాభావం  వల్ల నిర్వహించలేకపోయినట్లు తెలిపారు.  ఆగష్టు, 31 వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో మినరల్ ఫండ్ రూ. 38.98 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.  నిబంధనల మేరకు జిల్లా మినరల్ ఫండ్ నుండి 5 శాతం అంటే రూ. 1.94 కోట్లు అత్యవసర పరిస్తితులకై జాతీయ బ్యాంకులో జమ చేసామన్నారు.

మరో 5 శాతం పరిపాలన, డైరెక్టర్   మైన్స్ ఖాతాలో జమ చేశామని అమ్బుడ్స్ మెన్, ఇతరములకు 5 శాతం రూ. 1.94 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  మిగిలిన 85 శాతం నిధులను మైన్స్ ద్వారా నష్టపోయిన ప్రాంత అభివృద్ధి సమతుల్యం గురించి ఖర్చు చేయాల్సి ఉంటుందని సభ్యుల దృష్టికి తెచ్చారు.  15 శాతం పోను మిగిలిన 33.14 కోట్ల నిధుల్లో ఇప్పటికే జిల్లాలోని వివిద నియోజకవర్గాల్లో సంబంధిత శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుల సిఫారసు మేరకు రూ. 23.81 కోట్ల రూపాయల నిధులకు పరిపాలన అనుమతులు జారీ చేసి పనులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. 

ఈ నిధుల్లో పార్లమెంట్ సభ్యులు రూ. 3.50 కోట్ల నిధులకు సిఫారసు చేయగా నాగర్ కర్నూల్ శాసన సభ్యులు వివిధ పనులకు రూ. 5.56 కోట్లకు సిఫారసు చేశారన్నారు.  కల్వకుర్తి శాసన సభ్యులు రూ. 2.62 కోట్లు, కొల్లాపూర్ శాసన సభ్యులు 3.49 కోట్లకు సిఫరాసు చేయగా పరిపాలన ఆమోదం పొందినట్లు తెలిపారు.  మిగిలిన రూ. 9.33 కోట్లకు ఇక నుండి ముందుగా కమిటీ లో చర్చించి ఆమోదం పొందిన అనంతరమే పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలియజేసారు.

ఇప్పుడు చేసే ప్రతిపాదనలు  అత్యవసరమైన ప్రజా హితం పనులకు వాడుకోవాలని, ప్రజలకు ఎక్కువ ప్రయోజనం సత్వర ఫలితాలు వచ్చే విధంగా చూసి సిఫారసులు చెయాల్సిందిగా శాసన సభ్యులకు సూచించారు.  అనుమతులు పొందిన పనులు సైతం సత్వరమే పూర్తి అయ్యేవిధంగా చూడాలని సూచించారు.  మన ఊరు మనబడి పనులపై చర్చ సందర్బంగా మాట్లాడుతూ పనులు ఏ దశలో ఉన్నాయి, పెండింగ్ కు గల కారణాలు ఏమిటి అనే విషయాలు అధికారులు సంబంధిత శాసన సభ్యుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.  మన ఊరు మన బడి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   మన ఊరు మనబడి అంశం పై ఒక రోజు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ మన ఊరు మనబడి పనులు వేగవంతంగా సాగడం లేదని, కల్వకుర్తి నియోజకవర్గం గుండూరులో ఇప్పటి వరకు పనులు  ప్రారంభించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  వర్షం వల్ల పిల్ తరగతుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందుకు కలుగుతున్నాయని త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయలని కోరారు. 

కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ మన ఊరు మనబడి పనుల పురోగతి, సమస్యల పై అధికారులు శాసన సభ్యులతో చర్చించకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కాకుండా పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  

Related posts

తమ పిల్లల ప్రవర్తన, అలవాట్ల పై తల్లిదండ్రులు కన్నేసి వుంచాలి

Satyam NEWS

విశాఖలో విష వాయువుల విలయతాండవం

Satyam NEWS

తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ పత్రాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment