38.2 C
Hyderabad
April 28, 2024 22: 22 PM
Slider క్రీడలు

మహిళా బాక్సర్ లోవ్లినా కు మానసిక వేధింపులు

#lovlena

ఒలింపిక్ పతక విజేత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ పెట్టిన ఒక ట్విట్ ఇప్పుడు వివాదం రేగుతున్నది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌లో ఆమెఉన్నారు. గేమ్స్‌లో ఆమె మ్యాచ్‌కు ఇంకా ఎనిమిది రోజులు మిగిలి ఉన్నాయి.

అయితే లోవ్లినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన శిక్షణ నిలిపివేసి తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తన పట్ల నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, దీంతో తాను చాలా బాధపడ్డానని లోవ్లినా చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె మ్యాచ్‌కు ఎనిమిది రోజుల ముందు శిక్షణ ఆగిపోయింది. లోవ్లినా ట్విట్టర్‌లో ఇలా రాసింది ‘‘ఈ రోజు నన్ను చాలా హింసిస్తున్నారని చాలా బాధతో చెప్తున్నాను.

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడంలో నాకు సహకరించిన నా కోచ్‌లు ప్రతిసారీ, నా శిక్షణలో జోక్యం చేసుకుని, పదే పదే వాటిని మార్చారు. నా కోచ్‌లలో ఒకరైన సంధ్యా గురుంగ్ కూడా ద్రోణాచార్య అవార్డు గ్రహీత. నా కోచ్‌లు ఇద్దరూ శిక్షణ ఇవ్వడం కోసం చాలా ఆలస్యంగా వచ్చారు.

దీనితో శిక్షణలో నేను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం నా కోచ్ సంధ్యా గురుంగ్ కామన్వెల్త్ విలేజ్ (గేమ్ విలేజ్) వెలుపల ఉండిపోవాల్సి వచ్చింది. నా శిక్షణ నా మ్యాచ్‌కి ఎనిమిది రోజుల ముందు ఆగిపోయింది. నా రెండో కోచ్‌ని కూడా వెనక్కి పంపారు. నేను చాలా అభ్యర్థనల తర్వాత కూడా ఇది జరిగింది. ఇది నన్ను చాలా మానసిక హింసకు గురి చేసింది.

నా ఆటపై ఎలా దృష్టి పెట్టాలో నాకు తెలియదు అంటూ లోవ్లినా తెలిపింది. ఈ రాజకీయాల వల్ల కామన్వెల్త్ గేమ్స్‌లో నా ప్రదర్శనను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ రాజకీయాలను ఛేదించి నా దేశానికి పతకం తీసుకురాగలనని ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ ఆమె ముగించింది.

గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో లోవ్లినా భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. 69 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ ఛాంపియన్ చైనీస్ తైపీకి చెందిన నియెన్ చిన్ చెన్‌ను 4-1 తేడాతో ఓడించి ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. లోవ్లినా ఎవరిపై ఈ ఆరోపణలు చేసిందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు.

అయితే క్రీడా గ్రామంలో మాత్రం వివక్షకు గురవుతున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. సమాచారం ప్రకారం, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఎఫ్‌ఐ) పంపిన మొదటి క్రీడాకారులు మరియు సిబ్బంది జాబితాలో సంధ్యా గురుంగ్ పేరు లేదు. దీని తరువాత, BFI ద్వారా సవరించిన జాబితా పంపారు.

అందులో కూడా సంధ్య పేరు లేదు. తరువాత, లోవ్లీనా డిమాండ్‌పై, సంధ్య పేరును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి పంపారు. అలాంటి పరిస్థితిలో సంధ్యను పంపేందుకు అంగీకరించారు. ఇప్పుడు సంధ్య బర్మింగ్‌హామ్ చేరుకోగానే ఆమెకు స్పోర్ట్స్ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు.

Related posts

రాష్ట్రనికి రానున్న బన్సల్

Bhavani

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్ర‌యించిన అవినాశ్‌

Satyam NEWS

మల్లెల తీర్థంలో యువకుడి గల్లంతు

Satyam NEWS

Leave a Comment