28.7 C
Hyderabad
May 6, 2024 01: 45 AM
Slider పశ్చిమగోదావరి

పట్టపగలే కొల్లగొడుతున్న మట్టి మాఫియా

earth

ఏలూరు జిల్లాలో  పోలవరం కుడి కాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఏలూరు డివిజన్ లో అన్ని మండలాల పరిధిలో అధికారుల కనుసన్నలలోనే మట్టి మాయమైపోతుంది. ఆదివారం సెలవు దినం కావడం తో అధికారుల పర్యవేక్షణ ఉండదని తెలిసి ఎటువంటి అనుమతులు లేకుండా రాజకీయ అండదండలతో కొన్ని వేల క్యూబిక్ మీటర్ల మేర పోలవరం కాలువ మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వి తరలించుకుపోతున్నారు.

మరికొన్ని ప్రాంతాలలో అధికారులు కాంట్రాక్టర్ ల నుండి అందినకాడికి దండుకుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా కాంట్రాక్టర్ లు 30 వేలు క్యూబిక్ మీటర్ ల మట్టి తవ్వుకోవడానికి అనుమతి కోరితే అనధికారికం గా మరో 30 వేల క్యూబిక్ మీటర్ లు మట్టి తవ్వుకున్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టు పోలవరం కాలువ ఇంజనీర్ల పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మట్టి తరలింపులో చూసి చూడనట్టు వదిలేస్తున్న ఇంజనీర్ల మేలు మదిలో పెట్టుకుని  కాంట్రాక్టర్ లు  ఆదివారం ఇంజనీర్ల ఇళ్లకు ఫిష్, మటన్, చికెన్ లాంటి మూడు రకాల మాంసాహారాలు పంపి ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. ఇదిలా వుంటే మట్టి అనుమతులు పొందిన కాంట్రాక్టర్ లు కిందిస్థాయి ఇంజనీర్లు కాలువ మట్టి తవ్వడానికి యంత్రాలు గట్టు పై దింపిన మొదటి రోజే లక్ష రూపాయలు మామూళ్లు ముట్ట జెప్పేవరకు వెంటాడుతూనే ఉంటారని సమాచారం.

మామూళ్లు ఇవ్వకపోతే మళ్లీ మళ్లీ వేధింపులు

ఇంజనీరింగ్ శాఖలో విజిలెన్స్ అధికారులు దారి కాచి కాంట్రాక్టర్ లు టిప్పర్ల పై మట్టి లోడ్ చేసుకుని రోడ్డు ఎక్కగానే రకరకాల కొర్రీలు చూపి మరో లక్ష రూపాయలు వసూలు చేస్తారని కొంత మంది కాంట్రాక్టర్ లే లబోదిబో మంటున్నట్లు తెలిసింది. ఇదే విజిలెన్స్ అధికారులు కొద్ది రోజులు గడిచాక పై నుండి టార్గెట్ లు పేరుతో దాడులు చేసి కేసులు రాయాలని ఇబ్బంది పెడుతున్నారని మరో మారు మామూళ్ల దోపిడీకి తెర లేపుతున్నారని కాంట్రాక్టర్ లు ఆవేదన చెందుతున్నారు.

ఇక్కడితో అధికారుల దోపిడీ ఆగిందా అనుకుంటే పోరాబాటే ఉగాదికి, దసరాకి, దీపావళికి, సంక్రాంతికి టి వి లు ఫ్రిజ్ లు, టూ వీలర్ లు డబుల్ కాట్ మంచాలు, వాషింగ్ మిషన్ లు గిప్ట్ లుగా ఇచ్చుకోవాల్సిందేనని లేకపోతే పోలవరం గట్టు పై అనుమతి కి మించి మట్టి తియ్యనివ్వరని అవసరంమైతే ఇచ్చిన క్వాంటిటి తవ్వనియకుండా పర్మిట్ పూర్తి కాకుండానే ఇంజనీర్లు కాంట్రాక్టు ను రద్దుచేస్తారని తెలిసింది. మట్టి తవ్వుకోవడానికి అనుమతులిచ్చిన అధికారులు అడిగిన దానిని అందివ్వక పోతే ఆ కాంట్రాక్టర్ కి పోలవరం గట్టు మీద తట్టెడు మట్టి తవ్వే అనుమతికూడా ఇవ్వరని కొంతమంది అనుకుంటున్నారు.

దీనిపై కొంత మంది ఇంజనీరింగ్ సిబ్బందిని వివరణ కోరగా అదంతా అవాస్తవమని కొన్ని చెప్పుకోలేమని చెప్పారు. మట్టి అనుమతులిచ్చేది ముడుపులు తీసుకునేది పై స్థాయి అధికారులు నని  పర్మిట్ లు ఇచ్చి ఎవరైనా ఫలానా చోట అనుమతికి మించి మట్టి తవ్వుతున్నారని ఫోన్ చేస్తే అనుమతులిచ్చిన అధికారులు తప్పుకుని కింది స్థాయి అధికారుల మైన మమ్ములను అక్రమ తవ్వకాలను అడ్డుకొమ్మని పంపిస్తున్నారని కొంతమంది కింది స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Related posts

అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు

Satyam NEWS

విద్య‌ల‌న‌గ‌రంలో అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా అమృతోత్స‌వం…!

Satyam NEWS

రాజ్యాంగ, ప్రజా, కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

Satyam NEWS

Leave a Comment