31.2 C
Hyderabad
May 12, 2024 00: 07 AM
Slider ముఖ్యంశాలు

ఈ నెల‌ 14 న మహాధర్నాకు కదలిరండి: ఏఐటీయూసీ

#aituc

స్కీమ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 26వేలు ప్రకటించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి విజ‌య‌న‌గ‌రం  జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఈమేర‌కు అమ‌ర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ….ఈ నెల  14 వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

ఈ మేర‌కు మధ్యాహ్న భోజన పథక యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.స్రవంతి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి జీవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మి అప్పలరాజు దొర లతో  మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించే విధంగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు గడిచినా రాష్ట్ర వ్యాప్తంగా స్కీం కార్మికులకి ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు.

మీరు పంచుతున్న నవరత్నాలను సైతం ప్రజల్లోకి చేరువ చేయడంలో కానీ, కరోనాలాంటి ప్రమాద పరిస్థితిల్లో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన స్కీమ్ వర్కర్ల సమస్యలను గాలికి వదిలేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో చర్చించాలన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్కీం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం స్కీం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నేను ఉన్నాను నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యాడో అని వారు ప్రశ్నించారు.

తక్షణమే స్కీం కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మహిళా కార్మికులు పనిచేసే చోట భద్రత కరువైందని వారు తెలిపారు. తక్షణమే ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అవెంజర్స్ ఫోర్ ఆర్.పి  యానిమీటర్ల సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 14 న విజయవాడ లో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు

Related posts

భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ

Satyam NEWS

గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేందుకు కార్యాలయం

Satyam NEWS

ఉహాన్‌ కరోనా:వైద్య చికిత్సకై 450 మంది సైనిక డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment