26.7 C
Hyderabad
May 3, 2024 08: 38 AM
Slider కడప

అరాచక పాలన అంతం కావాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలి

#kamalapur

మహహోమం నిర్వహించిన టీడీపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ

రాష్ట్రంలో అరాచక పాలన అంతమొంది తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి కావాలని  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు.

పార్టీ ఆవిర్భవించి దిగ్విజయంగా 40 వసంతాలు  పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లా నియోజక వర్గ కేంద్రం అయిన కమలాపురం పట్టణంలో సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో సొసైటీ కాలనీ లోని అయ్యప్ప దేవాలయం ఆవరణలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో మంగళవారం మాహాహోమం నిర్వహించారు.

నియోజక వర్గం లోని వివిధ మండలాల నుంచి విశేష సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆత్మీయులు హోమ కార్యక్రమం శోభ యాత్ర లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేదపండితులు మారుతీ రామశర్మ  కైపా నరసింహాశర్మ  కేశవ స్వామీ హోమ పూజా సేవ  నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో దుష్ట అరాచక పాలన అంతం కావాలని దేవతలని  ప్రార్థిస్తూ నినాదాలు ఆలపిస్తూ హోమ పూజ ప్రధక్షణలు నిర్వచించారు. తెలుగు దేశం పార్టీ శోభాయమానంగా వర్ధిల్లాలని పట్టణంలోని సొసైటీ కాలనీ బీడి కాలనీ లలో శోభాయాత్ర నిర్వచించారు.

నియంతృత్వ పాలనతో అప్పుల అధోగతి

సాయినాథ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు అవలంబిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చెసి దేశంలోనే ప్రజలకు అధ్వాన్న పాలన అందించే మొదటి రాష్ట్రంగా దిగజారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లో భారత దేశం లో అట్టడుగు స్ధాయికి తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి చెందుతుందన్నారు. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం జెండాలు మోస్తూ పార్టీ నాయకత్వానికి అండదండగా ఉన్న ప్రతి కార్యకర్త మనసులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే తపన ఉప్పెనలా ఉప్పొంగుతోందన్నారు.

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ యాదవ్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని భావించే మహోన్నత ఆశయంతో ముందుకు వెళ్తున్న ప్రజాసంక్షేమ పార్టీ తెలుగు దేశం పార్టీ అని ఆమె కొనియాడారు. నిజాయితీకి మారుపేరుగా  ప్రజాసంక్షేమమే ధ్యేయంగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప . మహోన్నతుడు చంద్రబాబు నాయుడు అని ఆమె ప్రశంసించారు.

కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కుల్లూరు జనార్ధన్ రెడ్డి, పెండ్లిమర్రి తెలుగుదేశం నాయకుడు ఎల్ వి రామ మునిరెడ్డీ, పేద్ధచెప్పలి ఎం పి టి సి నాగరాజ ఆచారి,  మాజీ సర్పంచ్ రాయచోటి సుధాకర్, మాజీ ఎం పి టి సి  విజయ్ సుబ్రహ్మణ్యం, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మధ్ రఫీ  షుకూర్ హైదర్, దళిత సంఘ నాయకులు నామాల నాగరాజు బడ్డగాళ్ళ గంగాధర్ తెలుగు దేశం పార్టీ మహిళా నాయకురాలు ఎన్ అరుణ బి సి.  సంఘం నాయకులు ప్రవీణ్ అనిల్ అబ్బయ్య కోటపాటి జనార్థన్ తదితరులు భారీ సంఖ్యలో మహిళా కార్య కర్తలు పాల్గొన్నారు.

Related posts

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Satyam NEWS

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలి

Satyam NEWS

చేపల మార్కెట్ లో మత్స్యకారులకు అన్యాయం

Satyam NEWS

Leave a Comment