కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పోరాడాల్సి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు.తాము ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నామో ఆదిమాకు చేరడం లేదు అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే ‘‘ప్రజలు ఏం చేసినా కరెక్టుగానే చేస్తారు. కానీ మాకు ఇది పోరాడాల్సిన సమయం. మేం ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. పోరాడుతాం కష్టపడుతాం అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.