31.7 C
Hyderabad
May 2, 2024 08: 33 AM
Slider జాతీయం

జగదల్ పూర్ హైవే పై మక్క రైతుల ఆందోళన

#MaizFarmers

మక్క రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఎన్ని రోజులు ఎంత మందిని వేడుకున్నా ఫలితం కనిపించడం లేదు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ లో నేడు పది వేల మంది రైతులు రోడ్లపైకి వచ్చారు. కనీస మద్దతు ధర కోసం వారు చేస్తున్న ఆందోళనను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

దాంతో వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. నేడు నిజామాబాద్ జగదల్ పూర్ జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు ఆరు గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. మొక్క జొన్న, సోయా, వరి రైతులు తమ పంటలు పాడైపోయి అలో లక్షణా అంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

రైతులను ఆదుకోవాలంటే తక్షణమే మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. నేడు ఆరు గంటల పాటు జాతీయ రహదారిని నిర్భంధించిన తర్వాత సబ్ కలెక్టర్ కు రైతు ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం సమర్పించారు.

మక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని రూ.1850 మద్దతు ధర చెల్లించాలని వారు సబ్ కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సన్నరకాల వడ్లకు కనీస మద్దతు ధర రూ.2500 చెల్లించాలని వారు కోరుతున్నారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరారు.

Related posts

పిలిచి మంత్రి పదవి ఇస్తే అన్యాయం చేశారు

Satyam NEWS

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావచ్చు

Satyam NEWS

అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విజయనగరం ఎస్పీ తనిఖీలు…!

Satyam NEWS

Leave a Comment