40.2 C
Hyderabad
May 2, 2024 18: 05 PM
Slider వరంగల్

అకాల వర్షా బీభత్సానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంట

#rains

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగులిస్తున్నాయి. ములుగు జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, భారీగా వీ చి న గాలులకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న  పంట  సుమారు 100 ఎకరాల మేర  నేల కొరిగి పంట నష్టం జరిగింది. మల్లంపల్లి  గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు పోతనవేన సాంబయ్య రెండున్నర ఎకరాలు, మంద బిక్షపతి రెండున్నర ఎకరాలు, పోతనవేన ఐలు కొంరూ రెండెకరాలు, కూచిన వేన పోషాలు రెండెకరాలు కానుగంటి సతీష్ రెండెకరాలు  మంద దేవయ్య రెండెకరాలు  నూనెటి రాజు 4 ఎకరాలు  ఇలా వివిధ రైతుల మొక్కజొన్న పంట చేతికి రావలసిన సమయంలో  అకాల వర్షానికి దెబ్బ తినడంతో రైతులు విరవిలాడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకుంటున్నారు.

Related posts

సిపిఎంతో సహా అందరూ రంగులు మార్చేశారు

Satyam NEWS

రేగిడి ఆముదాలవలస పీఎస్ ను తనిఖీ చేసిన పోలీసు బాస్

Satyam NEWS

ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ నిరసనలు

Satyam NEWS

Leave a Comment