23.2 C
Hyderabad
May 8, 2024 02: 46 AM
Slider విశాఖపట్నం

రేపటి నుంచి మేజర్ పోర్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ క్రికెట్

Vizag sports

ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ స్పోర్స్ట్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షణలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 39వ అల్ ఇండియా మేజర్ పోర్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ 2019-2020 ని నిర్వహిస్తోంది. రేపు ఉదయం విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ కె. రామమోహనరావు పోర్టు డైమండ్ జూబ్లీ అవుట్ డోర్ ( క్రికెట్) స్టేడియంలో ఈ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించనున్నారు.

పోర్టు డిప్యూటీ చైర్మన్  పిఎల్ హరనాధ్, సెక్రటరీ  హరిచంద్రన్, శివకుమార్ పోర్టు చీఫ్ అంకౌంట్స్ అఫీసర్ ఇంచార్జ్, పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పది మేజర్ పోర్టులకు సంబంధించిన క్రికెట్ టీమ్ లు ఈ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటాయి. మ్యాచ్ లన్నీ టి20 ఫార్మాట్ లో 2 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరుగుతాయి.

 విశాఖపట్నం పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియం తోపాటు రైల్వే స్టేడియంలలో ఈ మ్యాచ్ లను ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నారు. సెమీ ఫైనల్స్ రెండు మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ ను పోర్టు స్టేడియంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 6వ తేదీన ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ క్రికెట్ చాంపియన్ షిప్ ముగింపు ‌వేడుకలను పోర్టు స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ చాంఫియన్ షిప్ లో 1. ముంబై పోర్టు ట్రస్టు, 2. కోల్ కతా పోర్ట్ ట్రస్టు, 3. దీన్ దయాళ్ పోర్టు ట్రస్టు, 4. ట్యూటీకోరిన్ పోర్టు ట్రస్టు,  5. పారాదీప్ పోర్టు ట్రస్టు, 6. జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు, 7. చెన్నై పోర్టు ట్రస్టు, 8. న్యూ మంగుళూరు పోర్టు ట్రస్టు, 9. కొచ్చిన్ పోర్టు ట్రస్టు, 10. విశాఖపట్నం పోర్టు ట్రస్టు (హోస్టింగ్) లు పాల్గొంటున్నాయి.

Related posts

అంతా నీ వల్లే…

Satyam NEWS

చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల‌పై దృష్టి

Satyam NEWS

శుభవార్త: మనం తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెడీ

Satyam NEWS

Leave a Comment