40.2 C
Hyderabad
April 29, 2024 18: 16 PM
Slider కడప

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తీర్మానం చేయాలి

Bhatyala 01

ఈనెల ఆరవ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ చట్టం, NRC,NPA లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, అందుకు తాము మద్దతు ఇస్తామని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు వెల్లడించారు. అలా కాకుండా రెండు నాలుకల ధోరణితో వైసిసి ప్రవర్తించడం తప్పని ఆయన నిశితంగా విమర్శించారు.

 కడప జిల్లా నందలూరు మండలం లో ఆదివారం మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో 25 మంది రాష్ట్ర ఎంపీ లల్లో 24 మంది పౌరసత్వ చట్టానికి అనుకూలంగా ఓటు వేశారని, తమ నాయకుడు చంద్రబాబు టీడీపీ ముగ్గురు ఎంపీ లకు అధికార వైసీపీ అధినేత మాదిరి విప్ జారీ చేయలేదని అన్నారు.

 22 మంది వైసీపీ యంపీ ల మూలంగా తమ ముగ్గురు యంపీ లల్లో ఇద్దరు పొరపాటున ఓటువేశారని, ఇందులో ఓటు వేయని కేశినేని నానికి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నానని అన్నారు. ఇప్పటికయినా ఆరవ తేదీ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, అందుకు తాము మద్దతు ఇస్తాం అని, అదే తమ నాయకుని అదేశం అని కూడా అని భత్యాల సృష్టం చేశారు.

ఈ దేశానికి పట్టిన దరిద్రం మోడీ అని, భారత దేశం లోని అన్నీ బ్యాంకులను మోసం చేసిన 28 మంది లో 27 మంది గుజారాతియులు అని భత్యాల చెంగల రాయుడు అన్నారు. బ్యాంకుల్ని లూటీ చేసింది పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కాదని మన దేశానికి చెందిన వారేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాజంపేట ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల రాయుడుతో బాటు బీజేపీ, వైసీపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.

Related posts

కర్నూలులో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Bhavani

రేవంత్ రెడ్డి విడుదలపై కొల్లాపూర్ లో సంబరాలు

Satyam NEWS

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చెయ్యండి

Satyam NEWS

Leave a Comment