30.7 C
Hyderabad
April 29, 2024 06: 08 AM
Slider ముఖ్యంశాలు

చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల‌పై దృష్టి

#Vijayanagaram Police

ఏపీ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నిక‌ల పోలింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. నాల్గో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 21 న జ‌ర‌గ‌నుంది. కాగా అందులో విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ప‌రిధిలో 296 పంచాయితీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గునున్నాయి.

మొత్తం 2వేల 752 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.2 వేల 792 పోలింగ్ కేంద్రాల‌లో ఓట‌ర్ల త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.  మొత్తం డివిజ‌న్ ప‌రిధిలో 51 అతి స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించిన జిల్లా పోలీస్ శాఖ ఈ సారి బందోబ‌స్తులో… అద‌నంగా రెండు ఏపీఎస్పీ ప్లటూన్ల‌ను వినియోగించ‌నున్నారు.

అదీ గాకా మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతంగా డివిజ‌న్ లోని మెంటాడ మండ‌లం లోతుగ‌డ్డ‌,కూనేరు,కొండ‌లింగాల వ‌ల‌స గ్రామాల‌ను గుర్తించిన పోలీసులు..ఆయా మండ‌లంపై  ఎక్కువ దృష్టి పెట్టారు.

ఈ మేర‌కు ఈ చివ‌రి విడ‌త పంచాయితీ ఎన్నిక‌ల బందోబ‌స్తున‌కు గారూ….జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ ఇప్పటికే….2 వేల 284 మంది సిబ్బందిని నియ‌మించారు.ఇందులో ఇందులో ఇద్ద‌రు ఏఎస్పీలు,14 మంది డీఎస్పీలు,32 మంది సీఐలు,79 మంది ఎస్ఐలు, 411 మంది ఏఎస్ఐలు, 803 మంది పీసీల‌తో ప‌టిష్ట బందోబ‌స్తును ఏర్పాటు చేసారు.

ఈ  మొత్తం సిబ్బందినుద్దేశించి….20 వ తేదీన ఉద‌యం 8 గంట‌ల‌కు జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ లో ఎస్పీ రాజ‌కుమారీ మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌నున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల‌ను సిబ్బందిని త‌ర‌లించేందుకు…ఆర్టీఏ స‌హాకారాన్ని కూడా  జిల్లా పోలీస్ శాఖ తీసుకుంది.

దాదాపు 120 ప్రైవేటు వాహ‌నాలతో పాటు శాఖా ప‌రంగా సిబ్బంది వాహ‌నాల‌లో కేటాయించ‌బ‌డిన పోలింగ్ కేంద్రాల‌ను  సిబ్బందిని త‌ర‌లించే ఏర్పాట్ల‌లో పోలీస్ శాఖ ఉంది. ఈ మేర‌కు స్పెష‌ల్ బ్రాంచ్ రేయింబ‌వళ్లు క‌ష్ట‌ప‌డుతోంది.

ఆ శాఖ‌కు ఇటీవ‌లే కొత్త‌గా వ‌చ్చిన సీఐ శ్రీనివాస్ రావు,మ‌రో సీఐ రాంబాబులు  ఎస్పీ కి కుడి భుజాలుగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని అందివ్వ‌డంతో పాటు…ఏయే సిబ్బందిని ఎక్క‌డెక్క‌డ వేయాలో అన్ని త‌మ‌కున్న అనుభ‌వంతో న‌మూనా రూపొందించి ఎస్పీ…అనుమ‌తితో సిబ్బందిని  ఆయా పోలింగ్  కేంద్రాల‌ను త‌ర‌లించ‌డంలో స‌ఫ‌లీకృతులు అవుతున్నార‌నే చెప్పాలి.

Related posts

ఎలక్షన్ ట్రిక్స్:బీజేపీ అభ్యర్థి బీ ఫారంను చింపేసాడు

Satyam NEWS

పోల్ నిషా: ఫుల్లుగా తాగారు ఇక గుద్దుడే గుద్దుడు

Satyam NEWS

పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment