29.7 C
Hyderabad
May 1, 2024 08: 34 AM
Slider ఖమ్మం

సీసీటీఎన్‌ఎస్‌ ను సద్వినియోగం చేసుకోవాలి

#khammamcp

నేర దర్యాప్తులో మరింత నాణ్యత ప్రమాణాలు  పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులో తీసుకొచ్చిన నూతన సీసీటీఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌) 2.0 వెర్షన్‌ను పోలీస్ అధికారులు సద్వినియోగం చేసుకొవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.  నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేర పరిశోధన, విచారణ అన్ని దశలోనూ లోప రహితంగా ఉండేటట్లు,  నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడం, బాధితులకు సరియైన న్యాయం జరిగేలా చేయడంలో పోలీస్ అధికారులు క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలన్నారు. నేర నిరుపణ, శిక్ష ఖరారు  (కన్విక్షన్ రెటు )తగ్గినప్పుడు అది సమాజంలోని  ప్రజల భద్రత, రక్షణపై ప్రభావితం చూపుతుందనే విషయాన్ని  అధికారులు గ్రహించాలని స్పష్టం చేశారు. నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ నమోదు నుండి నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వరకు లోతుగా అధ్యయనం చేయడం, నేరస్థులు తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి దోషులకు శిక్షలు పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్బంది చర్యలు తీసుకొవాలన్నారు.

అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని  సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో చట్టప్రకారం నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. కమిషనరేట్ అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలో విజబుల్ పోలీసింగ్ ద్వారా విస్తృతంగా  తనిఖీలు చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి నెంబర్ ప్లెట్ లేకుండా తిరుగుతున్న  వాహనాలను సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ శభరిష్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు, రహేమన్, వేంకటేశ్, భస్వారెడ్ధి, ప్రసన్న కుమార్ , రవి,  వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

Satyam NEWS

బీజేపీలో చేరను .. కాంగ్రెస్ లో ఉండను .. అమరీందర్ సింగ్

Sub Editor

లిస్టు పెట్టుకుని కక్ష సాధిస్తున్న వైఎస్ జగన్

Satyam NEWS

Leave a Comment