లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిందితులు గవాస్కర్, దిలీప్, నరేందర్ కార్లు బహుమతులుగా వచ్చాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు రాహుల్ అనే వ్యక్తి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల బ్యాంకులో నగదు డిపాజిట్ చేయించుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు.ఈకార్యక్రమంలో ఎసిపి రహమాన్ ఎస్ఎస్ఓ రాజు ఎసై రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు