31.7 C
Hyderabad
May 2, 2024 09: 57 AM
Slider ముఖ్యంశాలు

అంబర్ పేట్ లో ఘనంగా మండల్ డే

#BCMandal

మండల్ డే పురస్కరించుకుని తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నాడు నల్లకుంట కొరంటి ‘x’ రోడ్, అంబర్ పేట్ లో బి. పి. మండల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆగస్టు7, 1990వ సంవత్సరం భారత పార్లమెంట్ లో బీసీ ఉద్యోగులకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమోద ముద్ర వేయడంలో బీపీ, మండల్ కృషి గొప్పది. అప్పటి రాష్ట్ర పతి జ్ఞాని జైల్ సింగ్ కి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా బీపీ మండల్ ఉన్న సందర్భంలో 41సిఫారసులను రాష్ట్ర పతికి అందించారు. నేడు విద్య, ఉద్యోగం లో రెండు మాత్రమే 27 శాతం అమలు జరుగుతుంది. కానీ వారు సిఫారసు చేసిన 39 అంశాలు నేటికీ అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం మిగతా సిఫారసులను అమలులోకి తేవాలని తెలంగాణ బీసీ జాగృతి అధ్యక్షులు కేపీ. మురళీ కృష్ణ కోరారు. ఈ సందర్భంగా బిపి, మండల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గందమల్ల ఆనంద్ గౌడ్   ఏన్,బి,సీ ,ఏ, తెలంగాణ అధ్యక్షులు. పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ బీసీ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు  అచ్చిని రమేష్, రాష్ట్ర కార్యదర్శి పాతకోటి మహేష్, మీడియా సెల్ కన్వీనర్ కిరణ్ కుమార్ యాదవ్, పల్లె వెంకట్ గౌడ్, దిలీప్, మేదరి సంగం ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ (అడ్వకెట్), ఎరుకల సంగం నాయకులు కుతాటి రవి కుమార్, బి.ప్రశాంత్ ముదిరాజ్, వాసం శ్రీనివాస్, మీరయ్య గాడ్ తదితరులు పాల్గొన్నారు .

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

దళితులను మరోసారి మోసం చేసిన కెసిఆర్

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

Satyam NEWS

రోడ్ ప్ర‌మాదాలకు కార‌ణాలు అన్వేషించే ప‌ని కూడా చేస్తున్న ఖాకీలు…!

Satyam NEWS

Leave a Comment