31.2 C
Hyderabad
May 2, 2024 23: 25 PM
Slider

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి

#Manipur state

మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ భారతావని సిగ్గుతో తలదించుకునే విధంగా జరుగుతున్నా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైనందున ఆ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ రాఘవ ప్లాజా నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రివ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు.

ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, విదేశాలు తిరగడం చేశారే తప్ప ఆ రాష్ట్రంలో పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావని కావన్నారు.

పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్న ప్రధాని స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా గిరిజన తెగలు, ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరగడానికి బిజెపి అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు.

దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్వేష, మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణ హోమం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు.

సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని రద్దు చేసిశాంతినినెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related posts

పంతుళ్ల పై పగ: ఎన్నికల విధుల నుంచి అవుట్

Satyam NEWS

కరోనా కారణంగానే భక్తులకు ప‌రిమితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు

Satyam NEWS

చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు డాక్టర్ కడియాల సాయం

Satyam NEWS

Leave a Comment