కడప జిల్లా సిద్ధవటం మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు ఏకుల రాజేశ్వరి రాజంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి లోని ఆయన స్వగృహానికి రాజేశ్వరి, వైస్ చైర్మన్ రాసాల నరసింహులుతో కలిసి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకుల రాజేశ్వరితో పాటు మాజీ సర్పంచ్ కొత్తమద్ది వెంకటసుబ్బయ్య, మండల రైతు కన్వీనర్ పల్లె సుబ్బరామిరెడ్డి తదితరులు కూడా ఉన్నారు.