42.2 C
Hyderabad
May 3, 2024 15: 03 PM
Slider నిజామాబాద్

అన్యాయం చేస్తున్న కలెక్టర్.. లాఠీలతో కొట్టిన పోలీసులు

#hrc

హెచ్చార్సీని ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం హెచ్చార్సీకి చేరింది. తమకు చెప్పకుండా, ఎలాంటి సమాచారం లేకుండా భూములు లాక్కుని కలెక్టర్ తమకు అన్యాయం చేశారని, మాస్టర్ ప్లాన్ పై ఆందోళన చేస్తే పోలీసులు తమను విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపిస్తూ బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నలభై రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు.

ఈ క్రమంలో తమ సమస్యను పరిష్కరించాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డెంనాడ్ చేస్తూ వివిధ రూపాల్లో రైతులు నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతుందని, తనకు జీవనాధారమైన భూమి కోల్పోతుండటంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం రైతులను ఆగ్రహానికి తెప్పించింది. తమ ఆందోళనను ఉదృతం చేసి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించారు.

కలెక్టర్ వచ్చి వినతిపత్రాన్ని తీసుకోవాలని రైతులు డిమాండ్ చేసినా కలెక్టర్ బయటకు రాలేదు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు రైతులు ధర్నా ముగించుకుని మరుసటి రోజు బంద్ కు పిలుపునిస్తు రైతులు వెనుదిరిగారు. బంద్ రోజు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడించారు.

బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతర కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దూషిస్తూ తమను రెచ్చగొట్టేలా చేసారని, పోలీసులకు దొరికిన రైతులను కలెక్టరేట్ లోపలికి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని, ఎవరికైనా చెప్తే నెలల పాటు బయటకు రాకుండా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు బెదిరించారని ఆరోపిస్తూ ఏడుగురు రైతులు మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

రైతుల నిర్ణయానికి విరుద్దంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడమే కాకుండా తమకు అన్యాయం చేసిన చేసిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్, తమపై దాడి చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన కామారెడ్డి డిఎస్పీ సోమనాథం, కామారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్, దేవినిపల్లి ఎస్సై ప్రసాద్, రాజంపేట ఎస్సై రాజులపై చర్యలు తీసుకోవాలని, మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పట్ల కూడా కఠిన చర్య తీసుకోవాలని పిర్యాదు చేశామని రైతులు పేర్కొన్నారు.

ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ బాధితులు ఏకంగా కలెక్టర్, జిల్లా.పోలీసులపై హెచ్చార్సీని ఆశ్రయించడం, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సంబంధిత అధికారులకు నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు ఆరోజు ఏం జరిగింది అనేదానిపై హెచ్చార్సీ పూర్తి వివరాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. హెచ్చార్సీ నోటీసుల పట్ల జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts

అరాచ‌క శ‌క్తుల కుట్ర‌లు.. పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Sub Editor

వినుకొండ రోడ్ లో మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభం

Satyam NEWS

విదేశీ వ్యాఖ్యలను మళ్లీ తిప్పికొట్టిన భారత్

Satyam NEWS

Leave a Comment