32.2 C
Hyderabad
May 2, 2024 01: 29 AM
Slider గుంటూరు

60 వేల మంది ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికి విలేజ్ క్లినిక్ లు

#Narasa Raopet TDP office

వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ క్లినిక్ లు ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికేనని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్ ల ఏర్పాటు నిర్ణయం 60 వేల మంది ఆర్ఎంపీలను నిరుద్యోగులుగా మారుస్తుందని విమర్శించారు.

రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి వైద్యం చేయడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను నేర్పి పట్టాలు ఇచ్చి వైద్యం చేయడానికి ప్రోత్సాహకాలు ఇచ్చే వారిని జగన్ రెడ్డి తీసుకున్న విలేజ్ క్లినిక్లను నిర్ణయం ఆర్ఎంపీల పాలిటి శాపంగా మారిందని దుయ్యబట్టారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను జగన్ రెడ్డి వేపుకు తింటున్నారన్నారు.

జాబ్ క్యాలెండర్ వేయకుండా యువతను,సిపిఎస్ రద్దు చేయకుండా టీచర్లను,ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా రైతులను,సమాజంలో అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.జగన్ రెడ్డి కోతల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదని నరసరావుపేటకు వచ్చి నరసరావుపేటకు పాలిటెక్నిక్ కాలేజ్,ఆటోనగర్,ఫ్లై ఓవర్ హామీ ఇచ్చిన ఇప్పటికీ వాటి ఊసు లేదని జగన్ రెడ్డి కోతల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదని డా౹౹చదలవాడ అరవింద బాబు ఎద్దేవా చేశారు.

నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నది ఎంత నిజమో జగన్ రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఇస్తారన్నది కూడా అంతే నిజమన్నారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి అంటే తెలుగుదేశం అని నరసరావుపేట వినాశనం అంటే వైసీపీ పార్టీ అని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు.నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ హయంలో పేద ముస్లింల సౌకర్యం కోసం షాదిఖాన నిర్మించామని 10 లక్షల రూపాయలు మిగులు కూడా మెయింటినెన్స్ ఖర్చులకు కేటాయించామన్నారు.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో షాదీఖానాలో ముస్లింల కనీస అవసరాలు కూడా తీర్చుకోడానికి లేకుండా శిథిలావస్థకు చేర్చాని 10 లక్షల కరెంటు బకాయిలు కట్టకుండా షాదీ ఖానా చరిత్రను శిధిలావస్థకు చేర్చారని డా౹౹చదలవాడ అరవింద బాబు ఆరోపించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మున్సిపాలిటీలో అక్రమ పన్నులు వేసి వేల కోట్లు దోచుకున్నారన్నారు. అధిక పన్నులతో మున్సిపాలిటీ ప్రజల రక్తాన్ని పిలుస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్మికుల,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా దుర్భర దారిద్రం లోకి నెట్టివేయడాన్ని తప్పుపట్టారు.

మున్సిపాలిటీ పరిధిలోని చెట్లను పీకివేసి వాటి స్థానంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బిల్లులు చెల్లించకుండా కొత్త మొక్కలు తీసుకువచ్చి బిల్లులు చేసుకుని 70 లక్షలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దోచుకున్నారని డా౹౹చదలవాడ ఆరోపించారు.టీడీపీ హయాంలో కట్టిన షాదీ ఖానా,టౌన్ హాల్,ఇండోర్ స్టేడియం,సిమ్మింగ్ ఫుల్ తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అరవింద బాబు ప్రశ్నించారు.

అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతుల పంటలను నమోదు చేయడంలోనూ,ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ లోను అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని లబ్ధిదారులైన రైతులు కాకుండా వైసీపీ నాయకుల బ్యాంక్ అకౌంట్ లకు నష్టపరిహారం మళ్ళించడాన్ని డా౹౹చదలవాడ అరవింద బాబు తప్పు పట్టారు. వైసీపీ నాయకుల అవినీతి అక్రమాల పై ప్రతిపక్ష నాయకుడిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.వైసీపీ నాయకుల రౌడీ రాజకీయం పై అవినీతి,అక్రమాల పై విచారణ జరపాలని అరవింద బాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు కుమ్మేత కోటి రెడ్డి,శాఖమురి మారుతి,కర్రీ శివారెడ్డి,మొహ్మద్ రఫీ,నాగూర్,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,చల్లగుండ్ల హరిక్రిష్ణ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి

Satyam NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్

Satyam NEWS

రైతు వేదిక పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment