38.7 C
Hyderabad
May 7, 2024 17: 50 PM
Slider హైదరాబాద్

వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ అమర వీరులకు నివాళి

#mcpi

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని అమరవీరుల స్థూపం వద్ద MCPI(U) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల కు నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 23వ వర్ధంతి సభ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా MCPI(U) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎర్ర రాజేష్ మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు  చేతుల్లో కీలుబొమ్మగా ఉంటూ ప్రజలపై విపరీతమైన కరెంటు చార్జీలు పెంచి ఇబ్బంది పెడుతున్న సమయంలో జరిగిన ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన విష్ణువర్ధన్,బాలస్వామి, రామకృష్ణ లకు జోహార్ అర్పించారు.

2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా అధిక విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలంతా తిరుగుబాటు చేశారని తెలిపారు. కరెంటు చార్జీలు తగ్గించాలని లక్షలాది మందితో హైదరాబాద్ తరలివచ్చిన ప్రజలపై నాటి చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా సాగించిన నిర్బంధంలో గుండుకు గుండెలను చూపి ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. ఈనాటి కేంద్ర ప్రభుత్వం కూడా తెచ్చిన విద్యుత్ సంస్కరణలను కూడా రద్దు చేయాలన్నారు.

నేటికీ 23 సంవత్సరాలు అవుతున్నా విద్యుత్ అమర వీరులను తలుచుకుంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో MCPI(U) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ నాయకులు MCPI(U) మేడిపల్లి మండల కార్యదర్శి మార్టిన్, జిల్లా నాయకులు ఎన్ నాగరాజ్, పి రాజు ఈ యాదగిరి, తిరుపతి, రవీందర్ గౌడ్ కిరణ్ ఆర్ రామచందర్, మారం రామస్వామి, పార్టీ సీనియర్ జిల్లా నాయకులు మల్లేష్ ,పాల్గొని విద్యుత్ అమరవీరులకు జోహార్లు అర్పించారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Satyam NEWS

త్వరలో జరిగే 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంపై సిఎస్ సమీక్ష

Bhavani

Story repeat: నారా లోకేష్ పై ఆకివీడు పోలీసుల కేసు

Satyam NEWS

Leave a Comment