38.2 C
Hyderabad
April 29, 2024 19: 43 PM
Slider కృష్ణ

త్వరలో జరిగే 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంపై సిఎస్ సమీక్ష

#Dr. KS Jawahar Reddy

త్వరలో జరగనున్నమూడవ జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో ప్రాధమిక సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్న అంశాలు,ప్రస్తుతం అమలు చేస్తున్నవివిధ ఉత్తమ ప్రాక్టీసులు వంటి అంశాలను సిఎస్ ల సమావేశంలో చర్చించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ జవహర్ రెడ్డి చర్చించారు.

వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వెల్నెస్ కేంద్రాలు,ఫ్యామిలీ డాక్టర్ విధానం,ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం,కేష్ లెస్ ట్రీట్మెంట్ వంటి పలు అంశాలను రానున్న సిఎస్ ల సమావేసంలో చర్చించేందుకు వీలుగా తగిన నివేదికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబుకు సూచించారు.

అదే విధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టిన పలు సంస్కరణలపైన ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ విధానం,నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేకంగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

ఇంకా తాగునీరు,విద్యాపరంగా చేపట్టిన సంస్కరణలు వంటి అంశాలపై సిఎస్ ల సమావేశంలో చర్చించేందుకు వీలుగా తగిన నివేదికలు సిద్ధం చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఈసమవేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు, ఆశాఖ కమీషనర్ జె.నివాస్,రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్,ఎపి జెనక్కో ఎండి చక్రధర్ బాబు,సౌరవ్ గౌర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

మలయాళ హీరో సురేష్ గోపిపై ఛార్జ్‌షీట్

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరైన ప్రముఖులు

Satyam NEWS

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

Bhavani

Leave a Comment