40.2 C
Hyderabad
May 2, 2024 19: 01 PM
Slider విజయనగరం

డిప్యూటీ సీఎం  ప‌ర్య‌ట‌న‌లో మీడియా కు కష్టాలు…!

#media

ప్ర‌భుత్వం ఎంతో అట్ట హాసంగా నిర్వహించిన వైఎస్ఆర్ జ‌న్మ‌దినోత్స‌వం రోజు, అదీ రైతు దినోత్సం సంద‌ర్బంగా సంబందిత కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన మీడియా కు తీవ్ర మైన ఇబ్బందిని ఎదుర్కొంది.

విజయనగరం జిల్లాలోని సారిక లో జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఏర్పాటు చేసిన రైతుదినోత్స‌వ కార్యక్ర‌మాన్ని మీడియాను కూడా ఆహ్వానించిన జిల్లా  వ్య‌వ‌సాయ శాఖ‌..అందుకు  ఐ అండ్ పీర్ శాఖ‌లో స‌మ‌న్వ‌యం చేసుకుని వాళ్లంద‌రినీ ప్ర‌త్యేక వాహ‌నంలో తీసుకెళ్లింది.

స్వ‌యంగా డిప్యూటీ సీఎం,విజ‌య‌న‌గ‌రం ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే జిల్లా క‌లెక్ట‌ర్, అతిర‌థ మ‌హార‌ధులంతా హజ‌రైన కార్య‌క్ర‌మం మొత్తం మీడియా  క‌వ‌ర్ చేసింది. పోటోలు తీసింది. ఇక్క‌డ నుంచీ స‌మీపంలో ఓ సెంట‌ర్ ప్రారంభోత్సవాన్ని క‌వ‌ర్ చేసింది.

ఇక అదే డిప్యూటీ సీఎం కాన్వాయ్ తో తిరిగి మ‌రో రెండు కార్య‌క్రమాల‌ను క‌వ‌ర్ చేసేందుకు తిరిగి బ‌య‌లు దేరాల్సిన మీడియా వాహ‌నం…గ్రామ శివారుకు వెళ్లి ఇరుక్కు పోయింది. దాదాపు గంట‌న్న‌ర‌కు పైగా మీడియా అంతా వెహిక‌ల్ కోసం నిరీక్షించారు

అప్పుడే తెలిసింది…డిప్యూటీ సీఎం కాన్వాయ్ మూలంగా పోలీసులు మీడియా వాహ‌నాన్ని వెన‌క్కి వెళ్లిపోమ‌న్నార‌ని. దీంతో ఐ అండ్ పీఆర్ వెహకిల్ డ్రైవ‌ర్ దాన్ని..గ్రామ శివారుకు తీసుకెళ్లి తిరిగి క‌ట్ చేద్దామ‌నుకునే లోపే పొల్లాలో దిగిపొయింది. 

ఇదంతా అక్క‌డ‌కు సాక్షాత్ ఐ అండ్ పీఆర్ ఏడీ తోపాటు జ‌ర్న‌లిస్టులు వెళితేగాని తెలియలేదు. దీంతో  ఆఘ‌మేఘాల మీద స‌మాచార శాఖ… వ్య‌వ‌సాయ శాఖ ఏడీతో మాట్లాడి మ‌రో వెహకిల్  ర‌ప్పించి..మొత్తం మీడియాను క‌లెక్ట‌రేట్ కు తీసుకువ‌చ్చింది.

Related posts

కోర్ట్ డ్యూటీ అధికారులకు ఒక రోజు శిక్షణ

Satyam NEWS

మరో మారు టీమ్ ఇండియా కోచ్ బాధ్యతలు స్వీకరించిన వీవీఎస్

Satyam NEWS

భద్రాచలం ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Satyam NEWS

Leave a Comment