32.2 C
Hyderabad
May 8, 2024 14: 31 PM
Slider చిత్తూరు

మెడికల్ కాలేజీకి చెందిన భూమి అన్యాక్రాంతం

#NaveenkumarReddy

శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు కేటాయించిన 60 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు ది మేనేజింగ్ ట్రస్టీ కంచి కామకోటి పీఠం, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, స్విమ్స్ డైరెక్టర్ కు ఆయన లీగల్ నోటీసులు పంపారు.

స్విమ్స్ ట్రస్ట్ లో టీటీడీ ఈవో, టీటీడీ చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్,స్విమ్స్ డైరెక్టర్ కమిటీ సభ్యులుగా ఉన్నా60 ఎకరాలు చేతులు మారడం పై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

కంచి కామకోటి పీఠం అండ్ స్విమ్స్ ట్రస్ట్ కు 60 ఎకరాల భూమి అలాగే స్విమ్స్ కు 91.45 ఎకరాల భూమిని జీవో ఎంఎస్ నెంబర్ 1404 dt 03.11.2007 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకరా 75 వేలకు కేటాయించింది, కానీ కంచి కామకోటి పీఠం స్విమ్స్ ట్రస్ట్ 60 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడంతో జిఓ ఎంఎస్ నెంబర్ 1029 తేదీ 14 08 2008 ద్వారా ఉచితంగా కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల మరియు ఆసుపత్రి నిర్మాణానికి 100 ఎంబీబీఎస్ సీట్ల కొరకు skkp & svims, హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఫౌండేషన్ పేరున essentiality సర్టిఫికేట్ ఇచ్చినది, Dr NTR హెల్త్ యూనివర్సిటీ పద్మావతి మెడికల్ కళాశాల అనుబంధానికి అప్లియేషన్ సమ్మతించడం జరిగిందని ఆయన తెలిపారు. 11 8 2010 తేదీన కంచి కామకోటి పీఠం & స్విమ్స్ ట్రస్ట్ ప్రభుత్వ అనుమతితో ఒక ఎంవోయూ (అంగీకార పత్రం) రాసుకున్నారని ఆయన తెలిపారు.

దాని ముఖ్య ఉద్దేశాలు

1) ట్రస్ట్ లో మొత్తం12 మంది సభ్యులు ఉండవలెను అందులో 4 సభ్యులు ప్రభుత్వం వైపు నుండి అనగా స్విమ్స్ డైరెక్టర్,ఈవో టీటీడీ, చైర్మన్ టిటిడి బోర్డు సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మిగిలిన ఎనిమిది మంది సభ్యులను కంచి కామకోటి పీఠాధిపతి నియమిస్తారు!

2) ట్రస్ట్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఆధ్వర్యంలో ట్రస్టీల సహకారంతో ఈ సంస్థ నిర్వహించబడుతుంది

3) skkp & స్విమ్స్ , హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఫౌండేషన్ వారు కళాశాలకు, ఆస్పత్రికి కావలసిన వ్యయాన్ని భరించవలెను

4) ఈ కళాశాల మరియు ఆసుపత్రి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో స్థాపించబడినది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ/ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి నియమ నిబంధనలు పాటించవలెను ఇందులకు కంచి కామకోటి పీఠం అంగీకరించినది

5) ఒకవేళ ట్రస్ట్ వారు మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్వహించడంలో విఫలమైతే కళాశాలను మరియు ఆసుపత్రిని “స్విమ్స్” కు మాత్రమే అప్పగించవలెను!

6) కానీ 25 10 2012 వ తేదీన ఎం జ్యోతి ప్రకాశం అను అతను మేనేజింగ్ ఫస్ట్ పేరుతో స్విమ్స్ కు కేటాయించిన 91.45 ఎకరాలను అలాగే ట్రస్టుకు కేటాయించిన 60 ఎకరాలకు వెరసి 151,45 ఎకరాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా 75 వేల చొప్పున 1,13,62,500 ప్రభుత్వ ఖజానాకు చెల్లించి జిల్లా కలెక్టర్ ను ట్రస్ట్ పేరు మీద పట్టా ఇవ్వవలసిందిగా కోరడం నిబంధనలకు విరుద్ధం 2013లో కంచి కామకోటి పీఠం ట్రస్ట్ పునర్వ్యవస్థీకరించారని ఒకే కుటుంబానికి చెందిన 5 మంది సభ్యులను ప్రకటించుకున్నారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

“శ్రీ పద్మావతి” మెడికల్ కళాశాల పేరును “శ్రీ బాలాజీ” మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుమార్చి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ వారు essentiality సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

2020లో కంచి కామకోటి పీఠం ట్రస్ట్ ఫ్యాకల్టీ ఇతర సిబ్బంది కొరకు ప్రకటన విడుదల చేసి సిబ్బంది నియమించుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ తరఫున సభ్యుల భాగస్వామ్యం లేకపోవడం ఆశ్చర్యకరం. కంచి కామకోటి పీఠానికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అధికారం ఎరవిచ్చారు? 300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం ఇచ్చింది ఈ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని కానీ ఇటు స్విమ్స్ కి అటు ప్రభుత్వానికి సంబంధం లేని మూడవ వ్యక్తి చేతిలోకి 300 కోట్ల విలువ గల స్థలం చేతులు మారే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే “నిఘా సంస్థల” ద్వారా విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం,స్విమ్స్ ట్రస్ట్, స్విమ్స్ డైరెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపడం జరిగింది స్పందించని పక్షంలో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తానని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

Related posts

ఇంకా నాశనం చేయడానికి ఏపీలో ఏముంది?

Satyam NEWS

సి విజిల్ యాప్ పై ప్రజల్లో అవగాహన

Satyam NEWS

సంహారి మొదటి ప్రచార చిత్రం విడుదల చేసిన శంకర్

Satyam NEWS

Leave a Comment