31.2 C
Hyderabad
May 3, 2024 02: 38 AM
Slider గుంటూరు

పటిష్ట భద్రత కోసం సరిహద్దు జిల్లాల ఎస్ పిల సమావేశం

#Telangana assembly elections

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల భద్రత కోసం ఎస్ పిల సమావేశం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల సహకార సమావేశం లో నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావ్, సూర్యాపేట ఎస్పి రాజేంద్రప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్పీ వై.

రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు -2023 దృష్ట్యా పల్నాడు జిల్లా పరిధిలోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా గల పోలీస్ స్టేషన్ల పరిధిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలలో భాగంగా సరిహద్దు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చెక్ పోస్ట్ లను మరింత కట్టుదిట్టం చేయడం,అవసరం అయిన ప్రాంతాల్లో నూతన చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం వంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించారు.

అదే విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో నది ద్వారా అక్రమ రవాణా సాగించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగే విధంగా తగినంతమంది పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించి సరిహద్దు పోలీస్స్టేషన్ల వారు సమన్వయం చేసుకునే విధంగా మార్గ నిర్దేశం చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లోనీ పోలీస్ స్టేషన్ల అధికారులు మంచి సత్సంబంధాలు కలిగి, తమకు అందిన సమాచారాన్ని తమ సరిహద్దులో ఉన్న అధికారులకు చేరవేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సమావేశంలో సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏవైనా సంఘటన జరిగినట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని తెలిపారు.

నగదు మరియు మద్యం వంటి వాటిని అక్రమ రవాణా చేయడం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాద మోపాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డిఎస్పి ఆదినారాయణ, గురజాల డిఎస్పి పల్లపు రాజు ఇతర డిఎస్పీలు,సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం నిషేధించిన 59 చైనా యాప్ ల వివరాలు

Satyam NEWS

పెళ్లి పేరుతో మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఉరివేయాలి

Bhavani

రేపటి నుండి ములుగు జిల్లాలో లో రెండో దశ కరోనా టీకా

Satyam NEWS

Leave a Comment