39.2 C
Hyderabad
May 3, 2024 11: 49 AM
Slider ఆదిలాబాద్

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

#SoyamBaburao

తెలంగాణ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, ముఖ్యంగా వలస వచ్చిన లంబాడి బంజారా తెగలను గుర్తించి  ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయవద్దని  ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ స్వయం బాపురావు కేంద్ర మంత్రికి విన్నవించారు.

గురువారం నాడు ఢిల్లీలో ఆదివాసి సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల తో కలిసి ఎంపి స్వయం బాబురావు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే కి మెమోరాండం సమర్పించారు.

జీవో నెంబర్ త్రీ పై సుప్రీం కోర్టులో   తుదితీర్పు వచ్చేవరకు ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో ఆదివాసి ఉద్యోగులకు అన్యాయం జరగకుండా 5వ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జీవో నెంబర్ త్రీ కొనసాగించాలని.. ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఆదివాసులకే ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని విన్నవించారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లకుండా అటవీ ప్రాంతాల్లో అనాదిగా సాగుచేస్తున్న పోడు భూములకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కులకు  భూమి పట్టాలు కల్పించాలని కోరారు.

తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు న్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి నివేదించాలని ఎంపీ సోయం బాపురావు కోరారు.

ఎంపీ వెంట కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీ సోయం బాపు రావు కల్తీ వీరమల్లు RTD. Jc Aadhar society president, గొండి వీరమాల్లు రిటైర్డ్ DE  , AEWCA STATE PRESIDENT , చుంచు రామకృష్ణ De (state co-ordinator for 9 tribal communities in Telangana state) ఉన్నారు.

Related posts

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్

Satyam NEWS

వదల బొమ్మాళీ: బెయిల్ రద్దు పై విజయసాయిరెడ్డి కి నోటీసు

Satyam NEWS

Leave a Comment