42.2 C
Hyderabad
April 26, 2024 16: 02 PM
Slider కృష్ణ

తీరప్రాంత గ్రామాలలో మాక్ డ్రిల్ సాగర్ కవచ్

#mockdrill

తీవ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి తీర ప్రాంత గ్రామాల లో ఏదైనా ఒక చోట వారితో పాటు తెచ్చుకున్న పేలుడు పదార్థాలను అమర్చడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే కొత్త వ్యక్తులు, కొత్త బోట్లు సముద్రంలో గాని తీరప్రాంత గ్రామాల్లో తారసపడినప్పుడు సమాచారాన్ని ఏ విధంగా అందించాలి అనే అంశం మీద మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు సాగర్ కవచ్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

అవనిగడ్డ SDPO మహబూబ్ బాషా, పాలకాయ తిప్ప మెరైన్ సిఐ వల్లభనేని పవన్ కిషోర్ ఆధ్వర్యంలో తీరప్రాంత గ్రామాలైన ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయతిప్ప, బసవానిపాలెంలలో సాగర్ కవచ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 150 మంది పోలీసు సిబ్బంది తో ఈ డ్రిల్ నిర్వహించారు. ప్రతియేటా కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు మెరైన్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బందితో కలిసి సంయుక్తంగా ఈ మాకు డ్రిల్ ను నిర్వహించడం జరుగుతున్నది.

Related posts

19,20 తేదీలలో అరుణోదయ ‌సాంస్కృతిక  సమాఖ్య రాష్ట్ర సభలు

Murali Krishna

సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కు బెదిరింపులు

Satyam NEWS

ముస్లిం సోదరులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment