బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటనలో నిందితులను శిక్షించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు అయిన డిసెంబర్ 6 న ప్రతి ఏటా నిరసన తెలుపుతున్న ముస్లిం సంఘాలు నేడు కూడా భారీ ప్రదర్శన జరిపాయి.
నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలి, మౌలాలి, రియాజ్, ఆరిఫ్ కరీం, మసూద్ తసీన్, బోడే హుస్సేన్, జానీ అర్షద్, రఫీ ఖాదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు.