23.2 C
Hyderabad
May 8, 2024 00: 37 AM
Slider గుంటూరు

పెట్రేగి పోతున్న మైనింగ్ మాఫియా

#illegalmining

గుంటూరు జిల్లా వి.యన్.పాలెంలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతుంది. అమ్యామ్యాలతో అధికారులను ప్రసన్నం చేసుకుని, గతంలో తవ్విపడేసిన చోటే కొత్తవారు మైనింగ్ అనుమతులు పొందుతున్నారు. అసైన్డ్ భూముల పక్కనే సర్వే నంబర్ 502 లో అమ్మయ్య చౌదరి అనే అతనికి గతంలో మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు.

అతను గుంతలు తవ్వి మట్టి అసాంతం తవ్వుకుని అగాధాలను చేసి వెళ్ళిపోయాడు. మళ్లీ కొత్తగా ఇప్పుడు ఇదే గుంతల్లో రాశి కెమికల్స్ పేరుతో ఓ ప్రజా ప్రతినిధి బంధువుకి అనుమతులు ఇచ్చారు. చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా మైనింగ్ మాఫియా పెట్రేగిపోతూ 501 సర్వే నంబర్ లోని అసైన్డ్ భూముల్లోకి చొరబాటు చేసుకుని, దళితుల భూముల్లో యధేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు.

సమాచారం అందుకున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన పొక్లైనర్లను,లారీలను సీజ్ చేయకుండా, మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోవడం పట్ల గ్రామ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారు గుంటూరు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు. లేకుంటే తాము, గ్రామం నుంచి ఇళ్లు,వాకిళ్లు విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Satyam NEWS

రాష్ట్రంలో కార్తీక శోభ

Sub Editor

దీపావళి ఉత్సవ నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు

Satyam NEWS

Leave a Comment