29.2 C
Hyderabad
October 13, 2024 15: 41 PM
మహబూబ్ నగర్

ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

minister

కొల్లాపూర్ నియెజకవర్గం కోడేర్  మండలం నర్సాయిపల్లి గ్రామ నివాసి శ్రీధర్ రెడ్డి కూతురు వెటర్నరీ డాక్టర్  ప్రియాంక రెడ్డి దారుణంగా హత్యకు గురికావడంతో  వారి కుటుంబాన్ని శంషాబాద్ లో  మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.  ప్రియాంక రెడ్డి తల్లి తండ్రులకు ధైర్యం చెప్పారు. హత్యకు  సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకొని వారి కుటుంబాన్ని ఓదార్చారు. 

మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి  విషయాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి వివరించారు.  కేటీఆర్ తో ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డిని మాట్లాడించారు. దోషులను కఠినంగా శిక్షించాలని తండ్రి శ్రీధర్ రెడ్డి  కేటీఆర్ ని కోరారు. హత్యకు సంబంధించిన విషయాలను కేటీఆర్ కి ఫోన్ ద్వారా చెప్పారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారని చెప్పారని ఆయన తెలిపారు.

దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రత్న ప్రభాకర్ రెడ్డి, దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, శేఖర్ శెట్టి ఉన్నారు.

Related posts

కరోనా బాధితులను పట్టించుకోని ప్రభుత్వం: ప్రవేట్ ప్రాక్టీసులో డాక్టర్లు

Satyam NEWS

దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

కల్వకుర్తి మున్సిపాలిటీలో కట్టలు తెగిన అవినీతి

Satyam NEWS

Leave a Comment