38.2 C
Hyderabad
May 2, 2024 21: 50 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం

#MinisterNiranjanReddy

జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు పాత్ర నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వనపర్తిలో టియుడబ్ల్యుజె-ఐ జేయు అద్వర్యంలో వనపర్తి జిల్లా శాఖ తరపున నిర్వహించిన విలేకరుల ప్రాంతీయ సదస్సును మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

ప్రభుత్వపైన,  విధానపరమైన నిర్ణయాలు అమలు చేసే క్రమంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ విజయం కోసం కృషి చేసిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.

జర్నలిస్టు సంక్షేమానికి సకల చర్యలు

జిల్లా స్థాయిలో జర్నలిస్టుల కోసం చేసే పనుల కోసం వెనువెంటనే చర్యలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. అన్ని సమస్యలు, కావాల్సిన అంశాలపై తమకు పూర్తిస్థాయి అవగాహన ఉందని తెలిపారు.

వృత్తిపరమైన ట్రేడ్ యూనియన్, వృత్తి నియమాలు పాటించడానికి ఆలోచన చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కోరారు. జర్నలిస్టులు సమాజం కోసం- ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాలని,జర్నలిస్టులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకం కాదన్నారు. ఆయా సంస్థలు మాత్రమే వ్యతిరేకమని,  వాస్తవాలు,  ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే కథనాలు, వార్తలు రావాలని సూచించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుకునే బాధ్యత పాత్రికేయుడుదని,జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఇప్పటిలాగే కొనసాగుతోందన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో సంఘాలు వచ్చాయని, పోయాయని కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న కొన్ని సౌకర్యాలను సాధించింది మన యూనియన్ మాత్రమేనాని ఆయన అన్నారు.

మేం ఉద్యమాలు ఎలా నిర్వహిస్తామో అందిరికి తెలుసు

తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన ఓ యూనియన్ తమ యూనియన్ లో ఉన్నవారే ఉద్యమ కారులని అనుకుంటోందని, రాష్ట్రంలో బలంగా ఉన్న తాము ఏ విధంగా ఉద్యమాలు నడిపిస్తామో తెలుసునని అన్నారు.

ప్రభుత్వం అనేక హామీలు జర్నలిస్టుల కు ఇచ్చిందని, వాటిని సాధించుకునే దిశగా పోరాటం ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తాయన్న హెల్త్ కార్డులు పనిచేయడం లేదని,  లాంగ్ సెషన్స్ జర్నలిస్టుల కోసం నిర్వహించుకోవాలని ఆయన కోరారు. తే

దీలు ఫిక్స్ చేస్తే జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తామని, కరోనా కాలంలో జర్నలిస్టులను గుర్తించలేదని, ప్రభుత్వం మేము కేంద్రానికి, రాష్ట్రపతికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామన్నారు. ఇటీవల కేంద్రమంత్రి జవదేకర్ రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పడం సంతోషదాయకమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి డబ్బులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న అతిపెద్ద యూనియన్ మనదేనని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగనూరి శేఖర్ అన్నారు. మనకు ఏ కష్టం వచ్చినా మనమే తీర్చుకుంటున్నామని, రాష్ట్ర మహాసభల స్థాయిలో కార్యక్రమానికి కృషి చేసిన వనపర్తి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్ని యూనియన్లు ఉన్నా మాదే పెద్ద యూనియన్

ఎన్ని సంఘాలు వచ్చినా,ఎంత మంది నాయకులు వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేసే యూనియన్ టీయూడబ్ల్యృజేనే, మనది ట్రేడ్ యూనియన్, కలం కార్మికుల పక్షాన నిరంతర పోరాటమమే ధ్యేయమని చెప్పారు.

తెలంగాణలో పత్రికకు జీవం పోసి,స్వయంగా నడిపిన గోల్కొండ వ్యవస్థాపకులు సురవరం ప్రతాపరెడ్డి తొలి శాసనసభ్యుడు వ్యవహరించిన వనపర్తిలో మొదటి ప్రాంతీయ సభ నిర్వహించడం సంతోషదాయకమని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ చెప్పారు.

60 ఏళ్ల త్యాగాలు, జీవితాలు ఉన్న చరిత్ర కలిగిన యూనియన్ మనదని, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు పత్రికా అధిపతిగా మారడంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పత్రికలు నడవడం లేదన్నారు. ప్రజలకు సంబంధించిన కథనాలు రావడం లేదని, సోషల్ మీడియా వల్ల జర్నలిజం విలువలు నశిస్తున్నాయని చెప్పారు.

హక్కుల కోసం పోరాడుతూ విలువలు కాపాడుకోవాలి

హక్కుల కోసం పోరాడుతూ విలువలు కాపాడుకోవాలని, ప్రతీ అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం లేదని,కానీ మనం మెఫీ ( మీడియా ఎడ్యూకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు నిర్వహిస్తామని, వనపర్తిలో జర్నలిస్టుల కృషి అమోఘమని ప్రశంసించారు. తక్కువ సమయంలో పెద్ద సభను విజయవంతం చేశారని చెప్పారు.మా మధ్యలో జర్నలిస్టుల మధ్య ఉన్న సంబంధమే కాకుండా, అన్నదమ్ముల సంబంధం ఉందని జిల్లా యూనియన్ అధ్యక్షుడు మధు గౌడ్ చెప్పారు. వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని, మా తరపున మేము వారికి ఎళ్లవేలల సహకారం అందిస్తున్నామన్నారు.

ఏ రాత్రి జర్నలిస్టులకు సమస్యలు వచ్చినా, మేము ముందుండి పరిష్కరిస్తున్నామని, మేము ప్రభుత్వాలకు,  పార్టీలకు  వ్యతిరేకం అనే భ్రమను ఇప్పటికే తొలగించామని చెప్పారు.

ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు, బీమా సౌకర్యం కల్పించడం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మా ధ్యేయమని తెలిపారు.

మండలాల జర్నలిస్టుల పరిస్థితి బాగాలేదని, ఆర్థికంగా బాగున్నావారికి మాత్రమే ఇప్పుడు నెట్టుకురాగలుగుతున్నారని  ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రవీందర్ రెడ్డి చెప్పారు.

వనపర్తి జిల్లాలో వైద్య సేవలు

నేను వనపర్తి జిల్లాకు వచ్చిన అయిదు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్టుల కోసం అమలు చేశామని,

ఉచిత విద్యను ఇప్పటికే జర్నలిస్టుల పిల్లలకు అందజేస్తున్నామని తెలిపారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికే ఉచిత ఓపీ ఇస్తున్న ఆస్పత్రులతోపాటు మిగతా ఆస్పత్రుల్లో కూడా ఉచిత ఓపీ కోసం ఇండియన్ మెడికల్ అసొసియేషన్ తో మాట్లాడతామని తెలిపారు.

అలాగే రోగ నిర్ధారణ కూడా ఉచితంగా అయ్యేలా చూస్తామని, అలాగే జర్నలిస్టుల కోసం జీవిత బీమా యూనియన్ నుంచో లేదా ప్రభుత్వం నుంచో అయ్యేలా రాష్ట్ర నాయకత్వం కృషి చేయాలని కోరారు.

ఇదివరకు గోపాల్ పేట, పెద్దమందడి సాక్షి జర్నలిస్టులు మరణించిన సమయంలో మా వంతు సాయం చేశామని, కానీ ప్రతిసారి ఇలా చేయడానికి సాధ్యం కాదు కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తామని తెలిపారు. జర్నలిస్టుల కోసం శిక్షణ తరగతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ రెడ్డి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు పోలిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బోలేమోని రమేష్, సీనియర్ జర్నలిస్టులు ఊశన్న, పౌర్ణారెడ్డి, కొండన్న యాదవ్, సూర్య మాధవరావు, రమేష్ రావు, యాకూబ్, విజయ్, వహీద్, రాజేందర్, వెంకట్ గౌడ్  జర్నలిస్టులు రవికాంత్, దినేశ్, భాస్కర్ యాదవ్, కుమార్, మణ్యం, వహీద్, రవికాంత్, ఫరూఖ్ పటేల్, రవి, యాదిరెడ్డి, వినోద్, బాలరాజు, నవీన్, అంజి, అన్ని జిల్లాల, మండలాల జర్నలిస్టులు  పాల్గొన్నారు.

Related posts

పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా

Bhavani

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

మద్దతు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment