వీదేశీ, స్వప్రదేశీ యాణీకులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమానాశ్రయం అధికారులను కోరారు. నేడు ఆయన విశాఖపట్నం విమానాశ్రయాన్ని అంతటినీ క్షుణ్నంగా పరిశీలించారు.
వైద్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేసే వివరాలను ఆయన తెలుసుకున్నారు. మరింత వైద్య సిబ్బందిని పెంచాలని డిఎంహెచ్ఓ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎంబిబిఎస్ డాక్టర్లు కాకుండా ఎండి లను నియమించాలని డిఎంహెచ్ఓ ను మంత్రి ఆదేశించారు. స్వదేశీ ప్రయాణీకుల నుండి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకోవాలని మంత్రి సూచించారు. అదే విధంగా అదనపు పోలీసులను నియమించాలని సంబంధిత ఎసిపి ని ఆదేశించారు.