యాక్షన్ హీరో గోపీచంద్, సంపత్ నందితో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో గోపీచంద్ పక్కన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన చిత్ర యూనిట్, ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో గౌతమ్ నందా సినిమా చేసిన సంపత్ నంది, గోపీచంద్ ఈసారి మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ తో మూవీ చేయనున్నారు. కబడ్డీ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారని… సినిమా మొత్తం మీద గోపిచంద్ చాలా వేరియేషన్స్ లో కనిపించేలా కథని సిద్ధం చేసిన సంపత్ నంది ఈసారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది, ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది
previous post