రాజధాని గా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలకు సైతం కరోనా ఇబ్బందులు తప్పేలా లేవు. కరోనా వైరస్ ప్రభావం చూపక ముందే శిబిరాలు ఖాళీ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా అన్ని నిరసన శిబిరాలకు పోలీసులు సమాచారం అందించారు.
కరోనా పరిస్థితిని అమరావతి పోలీసులు తమకు అనుకూలంగా మలచుకున్నట్లు కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా కాలంగా పోలీసులు అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో శిబిరాలను తొలగించేందుకు విశ్వప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. ఇప్పుడు కరోనా ముందస్తు జాగ్రత్తల పేరు చెప్పి శిబిరాలను ఖాళీ చేయిస్తున్నారు. ఆదివారం ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కు రాజధాని రైతులు, మహిళలు మద్దతు తెలుపుతున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీనితో ఉద్యమాన్ని ఏ రూపంలో కొనసాగిస్తారన్న అంశంపై అంతటా ఆసక్తి. నెలకొని ఉంది.