38.2 C
Hyderabad
April 28, 2024 19: 21 PM
Slider క్రీడలు

జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ కు మంత్రి అభినందన

#Gymnastics Champion

జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ 2022 – 23 లో హైదరాబాద్ కు చెందిన నిష్క అగర్వాల్ అల్ రౌండ్ ఛాంపియన్ షిప్ తో పాటు, బ్యాలన్స్ డీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన సందర్భంగా రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

కేరళ రాజధాని తిరువనంతపురం లోని జిమ్మీ జార్జ్ ఇండోర్ స్టేడియంలో 30 డిసెంబర్ -2022 నుండి 02 జనవరి 2023 వరకు ఈ పోటీలు జరిగాయి. హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో నిష్క అగర్వాల్ నేడు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు.

రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉన్నత విద్యా కోసం 0.5% రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని తెలంగాణలో రూపొందించుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్న క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. జిమ్నాస్టిక్స్ లో రాణిస్తున్న నిష్క అగర్వాల్ ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో జిమ్నాస్టిక్స్ క్రీడను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ , ఇండియన్ జిమ్నాస్టిక్ టీం కోచ్ మనోజ్ రాణే, తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి GS మహేష్, జాయింట్ సెక్రటరీ విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బర్డ్ ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

నేడు పీఎం డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీమ్‌ ప్రారంభించనున్న మోడీ

Sub Editor

తెలంగాణ విముక్తి పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

Satyam NEWS

Leave a Comment