31.7 C
Hyderabad
May 2, 2024 08: 25 AM
Slider పశ్చిమగోదావరి

మట్టి తవ్వుకుపోతున్నా అంటీ ముట్టనట్టున్న అధికారులు

#soil

పోలవరం కుడి కాలువ కు సంబంధించి 800 కోట్ల రూపాయల విలువ చేసే మట్టి అక్రమం గా తరలిపోయిందని ఆరోపణలు రావడంతో జూన్ నెలలో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను ప్రభుత్వం పిలిచి సంజాయిషీ అడిగినట్లు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో వార్త ప్రసారం అయింది. అయినా ఏలూరు జిల్లాలో ఓ అధికారి జిల్లాలో పోలవరం గట్టు మట్టి తవ్వకానికి అనుమతులు లేవని ఓ ప్రముఖ దిన పత్రికకు పచ్చి అబద్దాలతో వివరణ ఇచ్చారు.

అప్పటికి వారం రోజుల ముందుగానే దెందులూరు నియోజక వర్గ పరిధిలో సుమారు 3 వేల క్యూబిక్ మీటర్ ల మట్టి తరలింపుకు అనుమతులిచ్చి ఆయన తన ఘనతను చాటుకున్నారని సమాచారం. జిల్లాలో పోలవరం గట్టుమట్టి తరలింపుకు అనుమతులు లేవని కృష్ణా జిల్లాలో అనుమతులున్నాయని కూడా ఆయన సెలవిచ్చారు.

ఏలూరు జిల్లాలో ఎటువంటి అనుమతులు లేవని అడ్డంగా అబద్దామాడేశారు. 3వేల క్యూబిక్ మీటర్ ల ముసుగులో 30 వేల క్యూబిక్ మీటర్ ల మట్టి తరలించుకుపోతున్నా ఆ అధికారి నోరు మెదపలేదని చెప్పుకుంటున్నారు. దీనిపై ఆ అధికారికి ఏ మేర ముడుపులు ముట్టాయో నని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 3 వేల క్యూబిక్ మీటర్ లకు అనుమతులిచ్చి 30 వేల క్యూబిక్ మీటర్ ల మట్టి తరలించుకుపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని దెందులూరు నియోజక వర్గం లో ఓ టి డి పి ప్రజాప్రతినిధి ఆ అధికారిని తీవ్రంగా మందలించి ప్రశ్నించినట్టు తెలిసింది.

దీని పై ఆ అధికారి కొద్ది రోజులు సెలవు పెట్టి విధులకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. మైనింగ్ విజిలెన్స్ అధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేసినట్టు చూపి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

Related posts

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆరో రోజు అన్నదానం

Satyam NEWS

త్వరలో ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా మహాసభలు

Satyam NEWS

శోభాయమానంగా ధనుర్మాస శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment