30.7 C
Hyderabad
April 29, 2024 05: 24 AM
Slider ఆదిలాబాద్

పరిసరాలు పరిశుభ్రం చేసుకున్న మంత్రి ఇంద్రకరణ్

#MinisterIndrakaranReddy

ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంలోని డోర్ లకు, గోడలకు, సోఫాలకు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసారు.

అనంతరం గార్డెన్ లో వర్షపు నీటిని శుభ్రం చేసి, గార్డెన్ లో కలుపు మొక్కలను తీసేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఒక్కరు తమ ఇంట్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు.

ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, fscs చైర్మన్ ధర్మాజీ రాజెందర్, నాయకులు ముత్యం రెడ్డి, జీవన్ రెడ్డి, రమణ రెడ్డి, కౌన్సెలర్ నరేందర్, గండ్రత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Bhavani

వాంటెడ్ జస్టిస్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

Breaking news: మిగ్ 21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పైలట్ల వీరమరణం

Satyam NEWS

Leave a Comment