37.2 C
Hyderabad
May 1, 2024 13: 33 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

minister i k reddy

నిర్మల్ నియోజకవర్గం నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో నూతన డంపింగ్ యార్డు, సెగ్రెషన్ షెడ్డును శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి మంజూరైన ట్రాక్టర్ ను గ్రామ సర్పంచ్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నే మొట్ట మొదటి డంపింగ్ యార్డు ను స్వల్ప కాలంలో  నిర్మల్ లో పూర్తి చేసుకున్నామని ప్రజలందరు తడి చెత్త,పొడి చెత్త ను సేకరించి డంపింగ్ యార్డు లో నిల్వ చేయడం వల్ల వ్యవసాయానికి వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుందని అన్నారు.

జనవరి రెండో తేదీ నుండి మరో దఫా పల్లెబాట కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి, ఎంపిపి రామేశ్వర్ రెడ్డి,  నాయకులు ముత్యం రెడ్డి, మురళి దర్ రెడ్డి,సర్పంచ్ రవీందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, PD DRDA వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్యం న్యూస్ ఎఫెక్ట్: అదనపు కలెక్టర్ వాహనం చలాన్లు క్లియర్

Satyam NEWS

వైసీపీ మరో కీలక నేతపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత వైద్యం

Satyam NEWS

Leave a Comment