ఒక శుభకార్యం లో పాల్గొనేందుకు మంత్రి జగదీష్ రెడ్డి శనివారం రాత్రి పుదుచ్చేరి రాష్ట్రం యానాం చేరుకున్నారు. తమ రాష్ట్రం వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి ని ఆదివారం ఉదయం పుదుచ్చేరి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావు మర్యాద పూరకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి యానాం లో మల్లాడి కృష్ణారావు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.
మంత్రి జగదీష్ రెడ్డి వెంట ఈ పర్యటనలో తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహా రెడ్డి, సినీ దర్శకులు శంకర్, టి ఆర్ యస్ పార్టీ నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి ప్రభృతులు కూడా పాల్గొన్నారు.