40.2 C
Hyderabad
May 2, 2024 15: 40 PM
Slider ముఖ్యంశాలు

రైఫిల్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తాడా..?

#ktr

కొడంగల్ లో తనపై కేసీఆర్ పోటీకి రాకపోతే కామారెడ్డిలో తానే పోటీ చేస్తానని ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తాడా అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో బిక్కనూర్, రాజంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి వచ్చి కేసీఆర్ మీద తొడ కొట్టడం అంటే పోచమ్మ ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్టేనన్నారు.

కేసీఆర్ మీద తాను ఎక్కడ ఒడిపోతానో అని సిమెంట్, సలాకలు ఇచ్చుడు బంద్ చేశాడని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ ఇక్కడినుంచి నిజామాబాద్ పారిపోతున్నాడన్నారు. నాడు సోనియాగాంధీని బలిదేవత రాహుల్ గాంధీని ఉత్త పప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. దొరలకు, ప్రజలకు పోటీ అని రాహుల్ గాంధీ అంటున్నాడని, ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు పోటీ అని  పోరాటంలో విజయం సాధించేది తెలంగాణ ప్రజలేనన్నారు. తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్ కుటుంబమే కారణమని ఆరోపించారు. ఢిల్లీ అహంకారం, ఢిల్లీ నాయకులతో పోట్లాడటం తెలంగాణ ప్రజలకు  కొత్త కాదని, ఢిల్లీ దొరల ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారని తెలిపారు. 55 ఏళ్ల కాంగ్రెస్ ఏమి పీకింది.. ఇప్పుడు మోచేతికి బెల్లం పెడుతున్నారన్నారు. నాడు అధికారం ఉన్నప్పుడు చేతకాలేదు కానీ ఇవాళ 2 వేల పింఛన్ 4 వేలు ఇస్తామంటున్నారని, కేసీఆర్ కు పింఛన్లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది.. మీ ముఖాలకు ఏముందని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లను చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రైతులను బిచ్చగాళ్లని చెప్పిన కాంగ్రెస్ ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

3 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంద్ బంధు చేసే వాళ్ళు కావాలా అని ప్రశ్నించారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు దమ్ములేక డీకే శివకుమార్, రాహుల్ గాంధీలను తెస్తున్నారని, బీజేపీ వాళ్ళు 15 మంది ముఖ్యమంత్రులు, అమిత్ షా, మోడీలను తెస్తున్నారని, బక్కపలచని కేసీఆర్ ను కొట్టడానికి ఢిల్లీ గులాములు వస్తున్నారన్నారు.  ఢిల్లీ నాయకులను నమ్ముకునే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలని, ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు.

Related posts

హుజూర్ నగర్ పట్టణంలో విగ్రహాలు తొలగింపులో ఉద్రిక్తత

Satyam NEWS

గొర్రెలను అడిగితే అక్రమ అరెస్టులా?

Satyam NEWS

ఈ ప్లేస్ ను మీరు ఎప్పుడైనా చూశారా?

Satyam NEWS

Leave a Comment