32.7 C
Hyderabad
April 26, 2024 23: 48 PM
Slider మెదక్

ఈ ప్లేస్ ను మీరు ఎప్పుడైనా చూశారా?

#komaticheruvu

ఎక్కడో మ్యాప్ లో చూసి ఉంటారు ఇలాంటి అద్భుత ద్వీపకల్పాన్ని. అయితే ఈ ద్వీపకల్పాన్ని చూసేందుకు వేల కిలోమీటర్లు వెళ్లక్కరలేదు. మన పక్కనే ఉంది.

 ‘వాన కురిస్తేనే చెరువు నిండాలి.. చెరువు నిండితేనే పంట పండాలి’ ఒకప్పుడు సిద్దిపేట ప్రాంత పరిస్థితి ఇది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కృషితో సిద్దిపేట స్వరూపమే మారిపోయింది.

మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ది చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెచ్చి రంగానాయకసాగర్‌లో ఎత్తిపోసేలా చేశారు. ఆ నీటిని ఊరూరా చెరువుల్లో నింపారు. సాగునీటి కష్టాలు తీర్చారు.

వట్టిపోయిన బీడు భూములను పచ్చని మాగాణిలా మార్చారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలోనే 3టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. గోదావరి జలాలతో ఈ రిజర్వాయర్‌ నిరంతరం కళకళలాడుతూనే ఉన్నది.

సాగునీటి కష్టాలు తీర్చడంతోపాటుగా పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. రిజర్వాయర్‌ నడిమధ్యలోని పల్లగుట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ అబ్బుర పరుస్తున్నది.

గుట్ట చుట్టూ రహదారులను తీర్చిదిద్దారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా  ఈ రిజర్వాయర్‌ను సందర్శించి రూ.110 కోట్లు పర్యాటక అభివృద్ధి కోసం ప్రకటించారు.

ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా మారనున్న రంగనాయకసాగర్‌ సిద్దిపేట ప్రజలకు గొప్ప వరమే.

Related posts

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి…

Satyam NEWS

ఐటెమ్ సాంగ్ అన్నాడు ఉన్నది దోచేశాడు

Satyam NEWS

వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

Satyam NEWS

Leave a Comment