37.2 C
Hyderabad
May 2, 2024 14: 09 PM
Slider రంగారెడ్డి

తెలంగాణా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది

#ministerktr

తెలంగాణా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నియోజక వర్గంలో ఆయన మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో  జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తుంటే బండారి లక్ష్మా రెడ్డి  గెలుపు పక్కా అయిపోయిందని అన్నారు.

407 బూత్ కార్యకర్తలు బాగా పనిచేసి లక్ష్మా రెడ్డి ని గెలిపించాలని కోరుతున్నా అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ ఏమైపోతుందో అని అనుమానం ఉండే. కానీ ఇవాళ తెలంగాణ దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్ లో ఉన్నానా లేక న్యూయార్క్ లో ఉన్ననా అని చెప్పాడు. బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కూడా నేను  హైదరాబాద్ లోనే ఉండాలి అని ఉంది అని ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో చెప్పాడు.

విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది అని ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి. 10 యేండ్ల కింద తెలంగాణ రాష్ట్రం లో చిమ్మాటి చీకట్లు. ఇదే చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసేది. మంచి నీళ్లు లేక ఆనాడు మన హైదరాబాద్ అవ్వలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆనాడు మెట్రో పనులు చేస్కోలేని పరిస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నే సాధ్యం అయింది అని ఆయన అన్నారు.

మళ్ళీ అధికారం లోకి వస్తే 24 గంటల మంచి నీళ్ళు ఇచ్చుకోవాలి. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. కర్ఫ్యూ లేదు. ముస్లిం, హిందు గొడవలు లేవు అని అన్నారు. మొన్న గణేష్ నిమజ్జనం వచ్చింది అదే రోజు ముస్లిం ల పండుగ వచ్చింది…కానీ ముస్లిం మత పెద్దలు వాళ్ళ పండుగను వాయిదా వేసుకొని నిమజ్జనం లో పాల్గొన్న వారికి మంచి నీళ్ళు ఇచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రం. మొన్న పార్లమెంట్ లో ఒక్క ముస్లిం ఎంపీ ని పట్టుకొని నీవు ఉగ్రవాదివి అని అంటాడు ఇది బీజేపీ వాళ్ళ పరిస్థితి అని తెలిపారు.

నిన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. దొరల తెలంగాణ కావాలా…. ప్రజల తెలంగాణ కావాలా అని మాట్లాడుతున్నాడు. ఢిల్లీ దొరల కు తెలంగాణ ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు అని కేటీఆర్ అన్నారు. బలి దేవత సోనియా గాంధీఅన్నది ఈ రేవంత్….రాహుల్ గాంధీ ని ముద్ద పప్పు అన్నది ఈ రేవంత్ కాదా…. వీడియోలు చూస్తే తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఇప్పుడే మంత్రి పదవులు అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా గెలిచిపోయాం అన్నారు ఏమైంది. జానా రెడ్డి కూడా నేనె సీఎం అంటున్నారు.

ఆనాడు ఉద్యమం లో రాని వారు ఇవాళ మేమే సీఎం మేమే సీఎం అని వస్తున్నారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాక 400 కె సిలిండర్ ను అందజేస్తాం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కు కృతజ్ఞతలు. నాకు టికెట్ ఇచ్చి నాకు ఉప్పల్ సేవ చేసే అవకాశం కల్పించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో 2500 కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గడిసిన 10 సంవత్సరాల లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. అభివృద్ధి ఆగకుండా ఉండాలి అంటే మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. కేసీఆర్ భరోసా అనే మ్యానిఫెస్టో మరింతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. నెల రోజులు మీరు కష్టపడితే 5 యేండ్లు నేను కష్టపడి పని చేస్తా. ఇప్పటికే అనేక సేవ కార్యక్రమాలు నేను చేశాను. మీరందరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి,  పార్టీ నాయకులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా 

Related posts

నేటి నుంచి మేడారం మహా జాతర పూజలు

Satyam NEWS

నో అబార్షన్ ప్లీజ్: ఆడపిల్లను చంపితే శిక్ష గ్యారెంటీ

Satyam NEWS

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

Satyam NEWS

Leave a Comment