నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ఆమె అనాథ. భర్త యాభై ఏళ్ళ క్రితమే మరణించాడు. ఆమెకు సంతానం లేదు. ఎలాంటి ఆస్థి పాస్తులు లేవు. నా అనే వారే లేరు. ఒంటరిగా ఒక పాడుబడ్డ ఇంటిలో ఉంటూ జీవనం కొనసాగిస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా ఇచ్చే 2016 రూపాయల వితంతువు పెన్షన్ తీసుకుంటూ 6 కిలోల రేషన్ బియ్యం తో జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటుంది.
30 రోజుల ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏల్లారెడ్డిపేట మండలం బండలింగం పల్లి గ్రామంలో పాడైపోయిన ఇండ్లను తొలగించే కార్యక్రమంలో భాగంగా పాలకవర్గం కొండ రాజవ్వ నివాసమైన పాత ఇంటిని సైతం కూల్చివేశారు. తన ఇంటిని కూల్చవద్దని ఎంతగానో వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎంతగా వేడుకున్నా పట్టించుకోలేదు.
దీంతో ఆమె బెస్త పోచవ్వ ఇంట్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నది. స్థానిక ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తనకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తాడనే ఆశతో ఉంది. కేటీఆర్ కొండ రాజవ్వ ను ఆదుకుంటారా లేదా వేచి చూడాలి.