37.2 C
Hyderabad
May 2, 2024 12: 54 PM
Slider ప్రత్యేకం

పీకే రిపోర్ట్ లో జూపల్లికే అనుకూలం:అందుకే కేటీఆర్ జూపల్లి ఇంటికి?

#jupalli

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, మున్సిపల్ మినిస్టర్ తారక రామారావు  తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు ఇంటికి వెళ్ళి కలిశారు. శనివారం కొల్లాపూర్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గత2018 అసెంబ్లీ ఎన్నికల ముందు జూపల్లి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సింగోటం గోపాల్ దిన్నే రిజర్వాయర్ కు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అది మంజూరు కావడంతో శిలాఫలకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకే రోజు 170కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.

జూపల్లి ఇంటికివెళ్లిన  మంత్రి కేటీఆర్

సభ అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్ వెళ్ళి కలిశారు. ప్రత్యేక గదిలో పలు ముఖ్య అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల, ఎమ్మెల్యే ఆల ,ఎంపీ రాములు కూడా ఉన్నారు. అయితే కొల్లాపూర్ టిఆర్ఎస్ లో రెండు వర్గాల పోరు   నడుస్తున్న సమయంలో కేటీఆర్ జూపల్లిని కలవడం విశేషంగా మారింది. ఈ మధ్య జూపల్లి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.

ఆ విషయం అందరికి తెలిసిందే. ఈ సమయంలో  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన  కేటీఆర్ జూపల్లిని కలవడంతో జూపల్లి అనుచరులకు, నియోజక ప్రజలకు కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే పీకే రిపోర్టులో  జూపల్లికి అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది.

అయితే జూపల్లి పార్టీ మారుతారనే పుకార్లు కూడా వచ్చాయి.అందుకే జూపల్లిని కేటీఆర్ బుజ్జగిస్తునట్లు  తెలుస్తుంది. మొత్తానికి జూపల్లి క్యాడర్, కార్యకర్తలు, జోష్ లో మునిగి తేలుతున్నారు.అయితే  టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కూడా తెలుస్తుంది.మరి జూపల్లి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కొన్ని రోజుల కిందటే నియోజకవర్గ  సమస్యలపై జూపల్లి

నియోజకవర్గంలో జూపల్లి అనుచరులపై,ప్రశ్నించిన వారిపై  పెడుతున్న  అక్రమ కేసులపై, చేస్తున్న దాడులపై,రైతుల సమస్యలపై, పాలమూరు-రంగారెడ్డి బాధితుల అంశాలపై గత కొన్ని రోజుల క్రితం జూపల్లి కేటీఆర్ దృష్టికి తీసుకు పోయినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు జూపల్లి ప్రగతిభవన్ లో సుమారు అర్ధగంట పైగానే చర్చలు జరిపినట్లు కూడా తెలిసింది.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నెట్ కొల్లాపూర్

Related posts

సరస్వతీదేవి సుమఖంలో శాంతికుమారి

Satyam NEWS

నరసరావుపేటలో వైభవంగా కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

ఈ నెల 30న స్వరూపానందేంద్ర స్వామి రాక

Bhavani

Leave a Comment