39.2 C
Hyderabad
April 30, 2024 21: 57 PM
Slider చిత్తూరు

అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై మంత్రి విమర్శ

#ambatirambabu

తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు జరిగిన అవమానంపై వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గీత దాటి విమర్శలు చేశారని మంత్రి ఆక్షేపణ వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే శాసన సభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపణ లు చేసిన విషయం తెలిసిందే. టీటీడీపై ఎమ్మెల్యే అన్నా విమర్శలు చేయడం తగదని మంత్రి అంబటి వెల్లడించారు.

అదనపు దర్శన టికెట్లు కావాలని కోరితే ఇస్తారని, అందుకు బహిరంగంగా విమర్శించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు అన్నారు. నేడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.

తాను విపక్షంలో ఉన్నప్పుడు సైతం అప్పటి ఈవో తమకు కావాల్సిన దర్శన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. అప్పటి ఈవో, జేఈవోలు ప్రోటోకాల్ ఇచ్చారన్నారు. అన్నా రాంబాబు అలాంటి ఆరోపణలు చేయడం వంద శాతం తప్పు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. దేవుడి వద్ద అధికార, విపక్షాలంటూ తేడా లేదు. చిన్న చిన్నగా ఒక్కరిద్దరు తక్కువ అవ్వడం వల్ల అలాంటి ఆరోపణలు చేయడం తప్పు. నేను విపక్షంలో ఉన్నప్పుడు నన్ను మంచిగానే మర్యాదించారు. ఇప్పుడు అలాగే మర్యాదిస్తున్నారు అని అంబటి రాంబాబు అన్నారు.

Related posts

వెలిగించకుండానే మండుతున్న వంట గ్యాస్

Satyam NEWS

పాక్ వెర్డిక్ట్:టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కు జైలు శిక్ష

Satyam NEWS

What Is Oversold

Bhavani

Leave a Comment