26.2 C
Hyderabad
November 3, 2024 21: 52 PM
Slider ముఖ్యంశాలు

ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటా

#seetakka

పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా ములుగు నియోజక వర్గానికి వచ్చిన మంత్రి సీతక్కకి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ములుగు గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… నేను పేదల కష్టాలు తెలిసిన పేదింటి ఆడ బిడ్డను మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసి గిరిజన బిడ్డను అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగు, రంగుల గోడలు కాదు, ప్రతి ఒక్క పేదవారి నైతిక అభివృద్దే ఈ దేశ, రాష్ట్ర అభివృద్ధి అని నమ్మిన వ్యక్తిని అని  తెలిపారు.

ములుగు నియోజక వర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు గుమ్మరించి నన్ను ఓడించాలని కుట్ర చేసిన వ్యక్తుల చెంప చెళ్లుమనిపించి నన్ను 33 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు నాపైన చూపిన ప్రేమ నేను మరువలేనిది, మీరు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ములుగు నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టంచేశారు. నేను ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటా, ములుగు నుండే పాలన కొనసాగిస్తానని, రాష్ట్రంలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చెయ్యడం కోసమే నన్ను పంచాయితీ రాజ్ శాఖ ఇచ్చారని, ప్రగతి భవన్ ముందు పేదలకు అడ్డుగా ఉన్న ఇనుప కంచెలు తొలిగించామని, ప్రజలకు సుపరిపాలన అందిస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, ములుగు

Related posts

నెలాఖరులోగా బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వుల జారీకి చర్యలు

Satyam NEWS

చినజీయర్ స్వామి పర్యటనకు దుబ్బాకలో పోలీసుల ఏర్పాట్లు

Satyam NEWS

కోలాటాలతో కామన్నవలసలో స్వాగతం…!

Satyam NEWS

Leave a Comment